యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చినా ఎందులో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టినట్టు టాక్. ప్రస్తుతం తారక్ ట్రిపుల్ ఆర్ పూర్తి చేసి త్రివిక్రం తో సినిమాకు టైం కేటాయిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో మొదట రష్మిక మందన్న, జాన్వి కపూర్ ల వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లు వినపడగా లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి అక్కినేని కోడలు సమంతని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

పెళ్ళి తర్వాత సమంత తన ఫాం కొనసాగిస్తుంది. మజిలీ, ఓ బెబీ, జాను సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం అశ్విన్ డైరక్షన్ లో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా త్రివిక్రం డైరక్షన్ లో సినిమాకు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. సమంతకు ఇది నిజంగా లక్కీ ఛాన్స్ అన్నట్టే. పెళ్లి తర్వాత సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాలు కూడా చేస్తుంది.

ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం బృదావనం, రభస, రామయ్య వస్తావయ్య సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాల తర్వాత సమంత మరోసారి ఎన్.టి.ఆర్ తో నటించబోతుంది. మరి ఈ క్రేజీ కాంబోలో ఎలాంటి సినిమా చేస్తుందో చూడాలి. ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తారని టాక్. ఎన్.టి.ఆర్, సమంత కాంబో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు.                                                                             

మరింత సమాచారం తెలుసుకోండి: