దీనితో పవన్ లుక్ అంతా ఈ మూవీలో చాల భాగం గుబురు గెడ్డంతోనే ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని పవన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా నెలరోజులు పెండింగ్ ఉన్నట్లు టాక్. పవన్ తన మూడ్ ను చెడగొట్టుకోకుండా ఈ నెల రోజులు వరసగా షూటింగ్ కు రాగలిగితే దిల్ రాజ్ గట్టెక్కినట్లే అని అంటున్నారు.
ఈనెలరోజుల పాటు జరిగే షెడ్యూల్ లో పవన్ అంజలి నివేదా థామస్ శృతి హాసన్ లు పాల్గొన పోతున్నారు. అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్ బ్రేక్ లేకుండా కొనసాగించగలిగితే అనుకున్న విధంగా ఈ మూవీ సంక్రాంతికి విడుదల అవ్వగలుగుతుంది. కానీ పవన్ స్వభావ రీత్యా 30 రోజులు వరసగా షూటింగ్ కు రావడం కష్టమైన పరిస్థితులలో పవన్ అందించే సహకారం బట్టి ఈ మూవీ సంక్రాంతి రేసుకు విడుదల అయ్యే ఆకాశం కనిపిస్తోంది.
ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాగలిగితే పవన్ మ్యానియాతో తిరిగి సినిమా ధియేటర్లకు కళ వస్తుంది అని అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీకి మరింత హైక్ తీసుకు రావడానికి దీపావళి పండుగ రోజున ఈ మూవీకి సంబంధించిన మరొక పాటను విడుదల చేయాలని దిల్ రాజ్ భావిస్తున్నట్లు టాక్. ‘పింక్’ మూవీ కథకు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చాల మార్పులు చేర్పులు జరిగినట్లు లీకులు వస్తున్నాయి. సుమారు మూడు సంవత్సరాల తరువాత పవన్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీకి చాల భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి