తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మొట్టమొదట కామెడీ నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారిన బండ్ల, తొలి సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన తీన్మార్ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ రెండవ సినిమా నిర్మించారు బండ్ల గణేష్. అయితే అప్పట్లో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా అనంతరం మరొకసారి పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి అత్యద్భుతమైన బ్లాక్బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు బండ్ల గణేష్.

ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ నిర్మాతగా పలు సక్సెస్ లని అందుకుంటూ కొనసాగిన బండ్లగణేష్ ఇటీవల కొన్నాళ్ళ క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ఎన్నికలు రావడం ఆపై కాంగ్రెస్ పార్టీలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బండ్లగణేష్ ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ పై కొంత సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఇక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం టిఆర్ఎస్ పార్టీ విజయాన్ని అందుకోవడంతో ఆపై కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు బండ్ల. ఇక అతి త్వరలో ఒక స్టార్ హీరో తో ఆయన సినిమా చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు ప్రచారం అవుతున్నాయి. కొన్నాళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసిన ఫోటోని షేర్ చేసిన బండ్ల, ఆయనతో సినిమా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఇకపోతే లేటెస్ట్ గా బండ్ల గణేష్ కు సంబంధించి కొన్ని కామెడీ స్పూఫ్ లను పలువురు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అయితే వాటి పై స్పందించిన బండ్లగణేష్, నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు నేను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేను దయచేసి రాజకీయాలతో నాకు ముడి పెట్టకండి అంటూ నెటిజన్లను కోరుతూ బండ్ల గణేష్ కొద్దిసేపటికే ఒక ట్వీట్ చేశారు. నిజానికి  అప్పట్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గనుక గెలవకపోతే తన గొంతు బ్లేడ్ తో కోసుకుంటా అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలే ఇప్పటికీ పలు విధాలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో మేమేల రూపంలో ప్రచారం అవుతున్నాయి. దానితో బండ్ల ఈ విధంగా స్పందించడం జరిగింది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: