ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక సాదాసీదా కామెడీ షో గా మొదలైన జబర్దస్త్ ప్రస్తుతం నవ్వులకు కేరాఫ్ అడ్రస్ గా..  ఎంటర్టైన్మెంట్ కిచిరునామాగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ప్రతి వారం కూడా సరికొత్త కామెడీ తో బుల్లితెర ప్రేక్షకులందరికీ జబర్దస్త్ ప్రోగ్రాం అలరిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. కేవలం కమెడియన్స్ వేసే కామెడీ పంచ్ లతో పాటు అటు మద్య మధ్యలో జడ్జ్ లు  వేసే పంచ్ లు  కూడా అందరినీ కడుపుబ్బ నవ్విస్తూఉంటాయి.



 ఇక సాధారణంగానే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరి కొత్త స్కిట్స్  తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారూ. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ స్కిట్ లో జడ్జ్ ల  ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ అయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో స్పాంటేనియస్గా స్కిట్  జరుగుతున్న సమయంలో అటు జడ్జీలు కూడా పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. సాధారణంగానే జబర్దస్త్ లో జడ్జి గా ఉండే రోజా.. స్కిట్  జరుగుతున్న సమయంలో తనదైన పంచులు వేసి నవ్విస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే..



 ఇక ఇటీవల మరోసారి స్కిట్ లో భాగం అయినా జడ్జి రోజా బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇటీవల జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్క అన్న విధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రోమో  మొదలవ్వగానే హైపర్ ఆది టీం లో జబర్దస్త్ లో ఉన్న సభ్యులు అందరూ కూడా స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తారు. స్కిట్ లో భాగంగానే జడ్జి రోజా హిస్టరీ టీచర్ అవతారమెత్తి హిస్టరీ అంటే ఏంటి అంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. హిస్టరీ టీచర్ గా మారిన రోజా అందరికీ ఎంతగానో కామెడీ పంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: