ఇక బ్యాచ్ లర్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ మోడల్ వైద్య సాక్షిని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సురేందర్ రెడ్డి ఆమె ఇన్ స్టాగ్రాం పిక్స్ చూసి ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అఖిల్ కు ఆమె పర్ఫెక్ట్ జోడీ అవుతుందని భావిస్తున్నారట.
అఖిల్ కోసం బాలీవుడ్ భామని సెట్ చేసే పనిలో ఉన్నాడు సురేందర్ రెడ్డి. అక్కినేని హీరోలంతా కూడా లవర్ బోయ్ ఇమేజ్ మాత్రమే సంపాదించారు. అయితే అఖిల్ మాత్రం మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తప్పకుండా అఖిల్ తన ప్లానింగ్ తో మిగతా హీరోలకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అఖిల్ బ్యాచ్ లర్ రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. బ్యాచ్ లర్ హిట్ అయితే అఖిల్ తప్పకుండా తన ఇమేజ్ మార్చుకోవడం పక్కా అని చెప్పొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి