సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. 2022 సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని చిత్రయూనిట్ ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే ఆ హంగామా వేరే లెవల్ లో ఉంటుంది. పరశురాం డైరక్షన్ లో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ఏడాది ముందే రిలీజ్ డేట్ ప్రకటించడం వెనక పెద్ద కారణమే ఉందని తెలుస్తుంది.

స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఒకేరోజు పొలోమంటూ ఒకేరోజుని రిలీజ్ డేట్ గా ప్రకటిస్తారు. సంక్రాంతి లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని నిర్మాతల ఆలోచన. అయితే స్టార్ హీరోలు కన్ విన్స్ అయినా నిర్మాతలు అవ్వరు. ఫైనల్ గా ఒక్కరోజు తేడాతో రిలీజ్ డేట్లు అడ్జెస్ట్ చేస్తారు. అయితే మహేష్ ఈసారి ముందు జాగ్రత్త గానే తన సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీరెప్పుడైనా రండి నేను మాత్రం సంక్రాంతికి ఫిక్స్ అంటూ సర్కారు వారి పాట 2022 సంక్రాంతి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.

ఇలా మహేష్ సంక్రాంతికి ఖర్చీఫ్ వేయడం వల్ల మిగతా హీరోలు దానికి ముందు వెనక డేట్స్ చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు మూడు నాలుగు వచ్చినా చూసే అవకాశం ఉంది. ఆల్రెడీ 2020లో బన్నీ, మహేష్, కళ్యాణ్ రాం సినిమాలు వచ్చాయి.. వాటిలో మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రెండూ మంచిగా ఆడాయి. కాబట్టి మహేష్ ముందు చెప్పినా ఆ డేట్ కు రావాలనుకుంటే వచ్చేయడానికి ఏ హీరో వెనకాడరని చెప్పొచ్చు.                                    

మరింత సమాచారం తెలుసుకోండి: