ఇక ఈ సినిమాలో నటించిన వైష్ణవ్ తేజ్ కు ఇది మంచి డెబ్యూ అని చెప్పొచ్చు. అయితే సినిమా కథ అనుకున్నప్పుడు బుచ్చి బాబు విజయ్ దేవరకొండ అనుకుని లైన్ రాసుకున్నాడట. అయితే ఈ కథ పూర్తి చేసే సరికి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిట్ అవడం ఆ తర్వాత గీతా గోవిందం కూడా బ్లాక్ బస్టర్ అయ్యే సరికి బుచ్చి బాబు తన ఆలోచనని మార్చుకున్నాడట. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తే మాత్రం కచ్చితంగా సినిమా ఫ్లాప్ అయ్యేది.
ఈ కథ కొత్త హీరోకే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు వైష్ణవ్ తేజ్ ను ఒప్పించడానికి కూడా చాలా కష్టపడ్డారట దర్శక నిర్మాతలు. మెగా ఫ్యామిలీ హీరో ఇలా విలన్ చేత శిక్షించబడటం లాంటి యాస్పెక్ట్స్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టొచ్చని భావించారు. కాని మెగా ఫ్యాన్స్ ప్రయోగాలను సపోర్ట్ చేస్తారని ఉప్పెన రిజల్ట్ తో తెలుస్తుంది. ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కే పర్ఫెక్ట్ మిగతా ఎవరైనా సరే ఇంత బజ్ వచ్చేది కాదని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి