మెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులందరికీ కొస మెరుపు అన్న విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టిన మొదటి హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. అయితే మొదట కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఇక సినిమాలకు దూరం గా ఉంది. అయితే ఇటీవలే పెళ్లి చేసుకుని నిహారిక సెటిల్ అయింది అన్న విషయం తెలిసిందే తన చిన్న నాటి స్నేహితుడు చైతన్య ను పెళ్లి చేసుకుంది నిహారిక. గత ఏడాది చైతన్యను పెళ్లి చేసుకుని కొత్త జీవితం లోకి అడుగు పెట్టింది. ఇక ప్రస్తుతం అక్కడక్కడ సోషల్ మీడియాలో కూడా మెరుస్తుంది మెగా డాటర్ నిహారిక.



 అయితే సాధారణం గా పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళిన తర్వాత ఎన్నో రకాల మార్పులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని విషయాల లో అడ్జస్ట్ కావాల్సి వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మెగా డాటర్  నిహారిక కు కూడా ఇలాంటి కష్టాలు ఎదురయ్యాయి అని అర్థమవుతుంది.  అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత పాత అలవాట్లను మార్చుకోవడం కాస్త కష్టం గానే ఉంది అంటూ ఇండైరెక్ట్గా చెప్పింది మెగా డాటర్ నిహారిక.



 ప్రస్తుతం తాను కంఫర్ట్ గా ఉన్నాను అంటూ మొహమాటం గా చెప్పుకొచ్చింది.  ఇకపోతే గతం లో ఓ ఇంటర్వ్యూ లో కూడా మెగా బ్రదర్ నిహారిక తండ్రి నాగ బాబు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు అనే విషయం తెలిసిందే. నిహారిక ను చిన్నప్పటినుంచి  ఎంతో గారాబం గా పెంచామని.. ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నామని ఇక అత్తారింట్లో అడుగుపెడుతున్న నిహారిక అక్కడి పరిస్థితులకు అనుగుణం గా ఎలా అడ్జస్ట్ అవుతుందో అని భయం కూడా ఉంటుంది అంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు మెగా బ్రదర్ నాగ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: