ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..తమిళ డైరెక్టర్ విజయ్. కంగనా ప్రధాన పాత్రలో, విజయ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తమిళ చిత్రం 'తలైవి'. తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత బయోపిక్ ఇది. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కనిపించనున్నారు కంగనా. అందులో BAGAMGAAభాగం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ విజయ్ వైఖరిని గమనించిన కంగనా... ఆయన నడవడిక, ఇతరులతో ఆయన మెలిగే శైలి, ఎప్పుడు చిరునవ్వుతో పని చేసుకు పోయే తత్వం.. ఇలా ఒకటేమిటి ఎన్నో విశేషాలను గురించి విజయ్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్టు పెట్టింది కంగనా.
ఎప్పుడూ కౌంటర్ల తో ఎటాక్ చేసే కంగనా రనౌత్... ఇలా మొదటి సారి ఓ వ్యక్తిని అమాంతం ఆకాశానికి ఎత్తేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఆమె ఏం చెప్పుకొచ్చిందంటే, మీరు వైన్ మాంసాహారానికే కాదు.. పార్టీలు టీ కాఫీ జోలికి కూడా అసలు వెళ్ళని వ్యక్తి. మీరు అద్భుతమైన, అరుదైన వ్యక్తి అని నేను చాలా తొందరగా గుర్తంచాను. షూటింగ్ సమయంలో కూడా ఏ ఒక్కరోజు మీపై తక్కువ భావం కలగలేదు.'' అంతేకాదు ఏ సందర్భంలోనూ కొంచెమైనా కోపం అభద్రతా భావాన్ని నేను చూడలేదు. మీరు మనిషి కాదు దేవుడు. హృదయపూర్వకంగా చెబుతున్నా.. ఐ మిస్ యూ'' అని డైరెక్టర్ విజయ గురించి పోస్ట్ లో రాసుకొచ్చారు కంగనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి