ఇలాంటి పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ ను అక్టోబర్ లో విడుదల చేస్తారా లేదంటే వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేస్తారా అన్నవిషయమై రాజమౌళి నుండి లీకులు రాబట్టడానికి ఇండస్ట్రీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు టాక్. ‘ఆర్ ఆర్ ఆర్’ తన రిలీజ్ డేట్ ను మార్చుకుని వచ్చే సంవత్సరం సంక్రాంతికి మారిపోతే సంక్రాంతికి రిలీజ్ కావలసిన చాల పెద్దసినిమాలు తమ డేట్స్ ను మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈపరిస్థితులు ఇలా ఉంటే రాజమౌళి ఆలోచనలు మాత్రం మరొక విధంగా ఉన్నాయి అని అంటున్నారు.
‘ఆర్ ఆర్ ఆర్’ ను దేశంలోని 10 భాషలలో డబ్ చేసి ఒకేసారి విడుదల చేయడమే కాకుండా ఈమూవీని అత్యంత భారీస్థాయిలో ఓవర్సీస్ లో విడుదల చేసి భారీ సంఖ్యలో ప్రీమియర్ షోలు ఓవర్సీస్ లో వేయాలని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. ఈప్లాన్ కార్యరూపం దాల్చాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడాలి.
దీనికితోడు భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్ని వయసుల వారికి పూర్తి కావడానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం పడుతుంది అన్నసంకేతాలు వస్తున్నాయి. దీనితో జనం అందరికీ పూర్తి వ్యాక్సినేషన్ పూర్తి అయి జనం కరోనా భయాలు పూర్తిగా మర్చిపోయిన తరువాత కరోనా 3వ వేవ్ గురించి కూడ వస్తున్న వార్తలు ఎంతవరకు యదార్థం అన్నవిషయం తేలిన తరువాత ‘ఆర్ ఆర్ ఆర్’ ను విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ అని అంటున్నారు. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలయ్యేది 2022 సమ్మర్ లో మాత్రమే అన్నసంకేతాలు మళ్ళీ వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి