ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా.... పవర్ స్టార్ కు జోడిగా మొదట సాయి పల్లవి పేరు వినిపించింది. అయితే ఈ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్నా... ఇప్పటివరకు సాయి పల్లవి షూటింగ్ కి హాజరు కాలేదు. ఈ నాచురల్ హీరోయిన్ కి డేట్స్ కుదరకపోవడం వలన ఈ మూవీలో సాయి పల్లవి కి బదులు నిత్య మీనన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా ఉధృతి కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. తిరిగి షూటింగ్ ప్రారంభం కాగానే నిత్యా మీనన్ సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భల్లాల దేవ రానా దగ్గుబాటి ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళంలో మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం... తెలుగులోనూ రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. అంటే పవన్ మరియు రానాలు కలిసి వారి పవర్ ని చూపించబోతున్నారన్న మాట. అయితే ఇంతకీ పవన్ కి జోడిగా నిత్యామీనన్ అయినా ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి