తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హీరో కార్తీ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. తమిళ్ లో ఆయన చేసిన సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తుంటారు. ఇక కార్తీ నటించిన కొన్ని సినిమాలకు పాత సినిమాల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో

ఇక కార్తీ డిఫరెంట్ లుక్ లో కనిపించిన సినిమా కాష్మోరా మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఇక కాష్మోరా అనే పేరుతో తెలుగులో ఓ సినిమా ఉంది. అది 1986లో రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ, రాజశేఖర్, శరత్ బాబు నటించిన సినిమా కాష్మోరా. ఇక కార్తీ నటించిన మరో సినిమా ఖాకీ. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే ఈసారి తెలుగులో నుండి కాకుండా బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ నటించిన సినిమా పేరు ను తీసుకున్నారు. 2004లో ఐశ్వర్య రాయ్, అమితాబ్ తదితరులు నటించిన సినిమా ఖాకి. మంచి కథతో తెరకెక్కిన కార్తీ నటించిన సినిమా ఖైదీ. ఇక ఇదే పేరుతో గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో మంచి విజయాన్ని అందించింది. ఇక కార్తీ నటించిన మరో సినిమా చినబాబు. ఇక ఇదే పేరుతో తెలుగులో 1988లో హీరో నాగార్జున, అమల నటించిన సినిమా. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

అంతేకాదు.. 1999లో బాలకృష్ణ నటించిన సినిమా సుల్తాన్. ఈ సినిమా అంత సక్సెస్ ను అందుకోకపోగా.. ఇదే పేరుతో కార్తీ ఇటీవల నటించిన సుల్తాన్ పేరుతో వచ్చింది. చిరంజీవి నటించిన మరో సినిమా దొంగ. కోదండరామ దర్శకత్వంలో వచ్చిన సినిమా బాగా ఆకట్టుకోగా.. ఇదే సినిమా పేరు తో కార్తీక్ మరో కథతో తెరకెక్కిన సినిమాకు దొంగ అని టైటిల్ పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఇక ఇదే సినిమా పేరు తో కార్తీ సర్దార్ అనే సినిమాలో చేయనున్నట్లు వార్తలు వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: