
ఆర్జీవి.. ఒక వివాదాస్పద దర్శకుడు.. కొన్ని కొన్ని సార్లు ఈయన ఏం చేసినా అది వివాదంగానే మారుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం వెరైటీ గా ఉంటుంది. ఏదైనా ఒక విషయం పై ప్రపంచమంతా ఒకేలా స్పందిస్తే ,అందుకు భిన్నంగా స్పందిస్తాడు వర్మ. అది ఏ విషయమైనా సరే, ఉదాహరణకు రాజకీయమైనా, సినిమాకు సంబంధించిన అంశమైనా..ఏదైనా కావచ్చు. ప్రతి దానికి భిన్నంగా ప్రవర్తించే కారెక్టర్ వర్మది. వర్మ ఎప్పుడూ కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు ఫామ్లోకి వచ్చారు అంటే అది ఆర్జీవి కారణంగానే అని కూడా చెప్పవచ్చు.
అయితే ఈ మధ్య కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక అంతకుముందు కుంభమేళ పై కూడా వర్మ కాంట్రవర్షియల్ ట్వీట్లు చేశారు.. ఇలా చెప్పుకుంటూపోతే వర్మ కాంట్రవర్సీ క్రియేట్ చేయని రోజంటూ ఉండదేమో.. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఆదివారం మే 9న అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇక సెలబ్రిటీల నుండి నెటిజన్ల వరకు ప్రతి ఒక్కరు తమ తమ తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు..
ఇక అంతే కాకుండా తమ జీవితాలలో తల్లి యొక్క ప్రాధాన్యం ఏంటి అనే విషయాన్ని కూడా పొందుపరుస్తూ ట్వీట్లు,పోస్ట్ లు కూడా చేస్తున్నారు. అయితే అందరూ ఒకే పద్ధతిలో ట్వీట్ చేస్తే, మరి వర్మ స్టైల్ ఎక్కడ.. అందుకే తనదైన శైలిలో మదర్స్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు వర్మ. ఈ వీడియోలో కొందరు తల్లులు, తమ పిల్లలను కొడుతుండడం మనం గమనించవచ్చు. దీని పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.. "మిమ్మల్ని కూడా మీ అమ్మ ఇలానే కొట్టిందా సార్"అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరేమో "రాము ఏం చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుందని" మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. కానీ మదర్స్ డే సందర్భంగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.