మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్, తన అందం, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి స్టెప్స్ వేయడానికి ఆమె రెడీ అవుతుండటంతో ఈ సాంగ్‌పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. విజయ్ ఎనర్జీకి, ప్రీతి గ్లామర్‌కి కలయికగా ఈ పాట ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్వాలిటీ ప్రొడక్షన్ విలువలు, బలమైన కథనం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్ర కథకు గట్టి బలం చేకూర్చేలా ఉండబోతుందని తెలుస్తోంది.
‘రౌడీ జనార్దన’ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి సమస్యలు, భావోద్వేగాలు, సంబంధాలు అన్నింటినీ సహజంగా, ఎమోషనల్‌గా చూపించనున్నారని సమాచారం. ఈ కథలో విజయ్ దేవరకొండ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, ఇప్పటివరకు చూడని కొత్త షేడ్‌లో ఉంటుందని అంటున్నారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేశ్ నటించనుండటం మరో ప్రధాన ఆకర్షణ. నేషనల్ అవార్డు విన్నర్ అయిన కీర్తి సురేశ్, తన సహజమైన నటనతో పాత్రకు ప్రాణం పోయనుందని అభిమానులు ఆశిస్తున్నారు. విజయ్ – కీర్తి జంట తెరపై మంచి కెమిస్ట్రీని పండించనుందని అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి ‘రౌడీ జనార్దన’ సినిమాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని టాక్. బలమైన కథ, గ్రామీణ నేపథ్యం, పవర్‌ఫుల్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్, స్టార్ క్యాస్ట్ – ఇవన్నీ కలసి ఈ సినిమాను ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా మలచనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాలను ‘రౌడీ జనార్దన’ ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి