జేమ్స్ కెమెరూన్ నోట వారణాసి పై అలాంటి మాట.. జక్కన్న గాల్లో తేలిపోవాల్సిందే..ఇక ఎవ్వరు ఆపలేం..!
అంతేకాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే తప్పకుండా కలుద్దాం, కలిసి పని చేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్టుగా మాట్లాడటం అప్పట్లో ఇండియన్ సినిమా ఆడియెన్స్‌ను విపరీతంగా ఎగ్జైట్ చేసింది.
ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు అది ఒక ప్రత్యేక గర్వకారణంగా మారింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు దిగ్గజ దర్శకుల మధ్య జరిగిన ఇంటరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జేమ్స్ కేమెరూన్ నుంచి రాబోతున్న అత్యంత అవైటెడ్ సీక్వెల్ అవతార్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా, దర్శకుడు రాజమౌళి ముందుకు రావడం విశేషం.
ఈ సందర్భంగా రాజమౌళితో జేమ్స్ కేమెరూన్ ఒక స్పెషల్ వీడియో చాట్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో చాట్‌లో జరిగిన సంభాషణ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వీడియో చాట్ సందర్భంగా జేమ్స్ కేమెరూన్ మాట్లాడుతూ,
“మీరు క్రియేట్ చేస్తున్న మ్యాజిక్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఉంది. మీరు ప్రస్తుతం షూట్ చేస్తున్న వారణాసి సెట్స్‌ను నేను విజిట్ చేయాలని అనుకుంటున్నాను” అని తెలిపారు. ఈ మాటలు వినగానే రాజమౌళి కూడా ఎంతో వినయంగా స్పందించారు.
“మీరు తప్పకుండా రావచ్చు సర్, అది మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది” అంటూ ఆహ్వానించారు.
ఇద్దరి మధ్య సంభాషణ చాలా సరదాగా, ఆసక్తికరంగా సాగింది. కేమెరూన్ మాట్లాడుతూ ..“మీరు చాలా కాలంగా షూట్ చేస్తున్నారు అనుకుంటా కదా?” అని ప్రశ్నించారు. దానికి రాజమౌళి సమాధానంగా –
“అవును సర్, దాదాపు ఒక సంవత్సరం నుంచి షూట్ చేస్తున్నాం. ఇంకా ఏడు నుంచి ఎనిమిది నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది” అని వివరించారు. అంతే కాదు, ఈ సంభాషణలో కేమెరూన్ సరదాగా మాట్లాడుతూ – “మీరు ఏదైనా ఫన్ సీన్స్ షూట్ చేస్తుంటే…
పులులు లాంటి యానిమల్స్‌తో ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా చేస్తే తప్పకుండా చెప్పండి,అప్పుడు మనం కలిసి కలుద్దాం” అంటూ నవ్వులు పూయించారు.ఈ మాటలు విన్న రాజమౌళి కూడా నవ్వుతూ స్పందించడం వీడియోలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ ఇద్దరు ప్రపంచ స్థాయి దర్శకుల మధ్య జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ చిట్‌చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జేమ్స్ కేమెరూన్ నోట నుంచి రాజమౌళి గురించి ఇలాంటి మాటలు రావడంతో జక్కన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
కొంతమంది అభిమానులు సరదాగా –“ఇక రాజమౌళి గాల్లో తేలిపోతూ ఉంటారు”..“హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా అయితే ఇంకేముంది” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి