సాధారణంగా సగటు ప్రేక్షకుడు ధియేటర్లోకి వచ్చిన తరువాత ఆ ధియేటర్ లో ప్రదర్శింప బడుతున్న సినిమా నచ్చకపోతే నిద్రపోయే సందర్భాలు చాల ఉంటాయి. అయితే తెలుగు సినిమా చరిత్రను తారుమారు చేయడమే  కాకుండా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ‘బాహుబలి’ సినిమా చూస్తూ ఏ వ్యక్తి అయినా నిద్రపోయాడు అంటే ఎవరు నమ్మరు.

అయితే విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ సినిమా చూస్తూ నిద్రపోయిన విషయాన్ని బయటపెట్టాడు. దీనికికారణం ఈసెలిబ్రిటీ రచయితకు  ధియేటర్ లో సినిమా చూస్తున్నపుడు వెంటనే నిద్ర వచ్చిందట. అదే అలవాటు తనకు ‘బాహుబలి’ ప్రీమియర్ షోలో ఎదురు కావడంతో ఆ ప్రీమియర్ షోకి వచ్చిన చాలా మంది షాక్ అయిన విషయాన్ని నవ్వుతూ గుర్తు చేసుకుంటూ తనకు ఉన్న విచిత్రమైన అలవాటును బయటపెట్టాడు.
అలీ హోస్ట్ చేస్తున్న టాక్ షోకి అతిధిగా వచ్చిన విజయేంద్ర ప్రసాద్  అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ ఆశక్తికర విషయం బయటపెట్టాడు. వాస్తవానికి తనకు ధియేటర్ లో ఏసినిమాను చూసినా నిద్ర వస్తుందని అందువల్ల తాను సినిమాను పెద్దగా చూడనని కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోతున్న సినిమా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ మహేష్ కు కథ రాయడం అంత సులువు కాదని అందుకనే తన ఆలోచనలలో మహేష్ మూవీకి సంబంధించిన కథ ఫైనల్ కాలేదు అన్న లీకులు ఇచ్చాడు.

ఇక దర్శకుడుగా తాను ఫెయిల్ అయిన విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు చాల బాధగా ఉంటుంది అని చెపుతూ తాను సినిమాలకు దర్శకుడుగా పనికిరానని తన కొడుకు రాజమౌళి అన్నప్పుడు తనకు బాధ కంటే కసి పెరిగిందని ఎప్పుడో ఒకప్పుడు తాను ఒక బ్లాక్ బష్టర్ హిట్ తీస్తాను అన్న నమ్మకం తనకు ఉంది అని అంటున్నాడు. ఇక కథ విషయంలో రాజమౌళిని ఒప్పించడం అంత సులువైన పని కాదని అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టే అతడు ఈ స్థాయికి ఎదిగాడు అంటూ జక్కన్న పడే కష్టం అందరికి అర్థం అయ్యేలా వివరించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: