
‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం పై అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీకి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అంటూ సోషల్ మీడియాలో హంగామా జరిగిన పరిస్థితులలో ఈ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఈ మూవీ టైటిల్ ను ఖరారు చేయడమే కాకుండా ఆల్రెడీ ఫస్ట్ లుక్ డిజైన్ కూడా రెడీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ఫస్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి విడుదల అయిన అధికారిక ప్రకనలో ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఫోటోలు చూపిస్తూ ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష గులాబీ పువ్వును పెట్టి ఈ సినిమాపై ఆసక్తిని హరీష్ శంకర్ కలిగించిన విషయం తెలిసిందే.
దీనిని బట్టి ఈ మూవీలో దేశభక్తి షేడ్స్ ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 15న విడుదల కాబోయే ఈ టైటిల్ కు సంబందించిన ఫస్ట్ లుక్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు పెంచాలని ఇప్పటి నుంచే హరీష్ శంకర్ పక్క వ్యూహాలలో ఉన్నట్లు తెలుస్తోంది. 2023 శంక్రంతి టార్గెట్ గా ఈ మూవీని విడుదల చేస్తారని అంటున్నారు. పవన్ కెరియర్ లోనే భారీ బ్లాక్ బష్టర్ గా ఈ ఉంటుందని ఇప్పటి నుంచే అభిమానులు కలలు కంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి