తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు ఉన్నప్పటికీ..  పూరి జగన్నాథ్ సినిమాలకు మాత్రం ఎంతో క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులందరినీ పూరి సినిమాలు ఉర్రూతలూగిస్తూ ఉంటాయి. పూరి సినిమాలో ఎక్కడా లాగ్ ఉండదు. కట్టే కొట్టే తెచ్చే అనే విధంగానే  సినిమాలను తెరకెక్కిస్తు ఉంటాడు. అంతేకాదు సినిమాల కోసం ఎక్కువ సమయం కూడా కేటాయించడు. రెండు మూడు నెలల్లోనే సినిమాలు తెరకెక్కిస్తు మిగతా దర్శకులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు పూరి జగన్నాథ్.


 ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి అటు ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు.  ముఖ్యంగా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన పోకిరి అనే సినిమాను తెరకెక్కించి తన పేరు టాలీవుడ్లో మారుమోగిపోయేలా చేసుకున్నాడు పూరి జగన్నాథ్.  పూరి టేకింగ్ స్టైల్ చూసి ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇకపోతే ఇటీవల పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కోసం ఒక స్టోరీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


 గతంలో అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమా మంచి విజయం సాధించింది.  ఇక ఇటీవలే అదిరిపోయే స్టోరీ సిద్ధం చేసిన పూరి జగన్నాథ్ ఈ కథలో 10 లైన్లను బన్నికి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశాడట.  ఇక ఈ స్టోరీ లైన్ కూడా అటు అల్లు అర్జున్ కు తెగ నచ్చేసినట్లు టాక్ వినిపిస్తుంది  ఈ సినిమాలో అల్లు అర్జున్  గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ స్టోరీ లైన్ ను అటు అల్లు అరవింద్ కి కూడా పంపిస్తే బాగా నచ్చిందని.. సినిమా ప్లాన్ చేద్దాం అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఒక అదిరిపోయే స్టొరీ తో పూరి జగన్నాథ్ బన్నీని లైన్ లో పెట్టాడు అని టాలీవుడ్ కోడై కూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: