కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి రావడంతో షూటింగ్ లు మొదలయ్యాయి. చిరంజీవి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా ‘ఆచార్య’ షూటింగ్ స్పాట్ లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈమూవీ పెండింగ్ షెడ్యూల్ అతిత్వరలో ప్రారంభం అవుతుంది అన్న వార్తలు వస్తున్నాయి.


ఈ మూవీకి సంబంధించి ఇక కేవలం 10 రోజుల పెండింగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో కొరటాల శివ ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి రిలీజ్ కు రెడీ పెట్టాలని గట్టి పట్టుదల పై ఉన్నాడు. అయితే ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్న విషయం పై ఇంకా ఎటువంటి క్లారిటీ రావడం లేదని టాక్. త్వరలో ధియేటర్లు తెరుచుకుంటున్నప్పటికీ ఇంకా కొద్దికాలం 50% ఆక్యుపెన్సీతో నడపాలని ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టబోతున్నాయి.


ఇలాంటి ఆంక్షల మధ్య చిన్న సినిమాల రిలీజ్ కు సమస్యలు ఉండవు కాని ‘ఆచార్య’ లాంటి భారీ బడ్జెట్ సినిమాను 50శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేస్తే బయ్యర్లకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనితో 100 శాతం ఆక్యుపెన్సీ మళ్ళీ తిరిగి మొదలయ్యేదాకా ‘ఆచార్య’ ను హోల్డ్ పెడతారని టాక్. వాస్తవానికి ఈమూవీని దసరా కు విడుదల చేయాలని భావించినా కరోనా ఆంక్షలు పెద్ద సమస్యగా మారబోతున్నట్లు తెలుస్తోంది.


దీనితో ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడే ఆస్కారం ఉంది. అప్పటికి కరోనా పరిస్థితులు చక్కబడి 100శాతం ఆక్యుపెన్సీ తో ధియేటర్లు కళకళ లాడతాయని ఆశ పడుతున్నారు. అయితే సంక్రాంతి సమయానికి ఊహించని విధంగా మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు ఎదురైతే అప్పటి పరిస్థితి ఏమిటి అన్న కన్ఫ్యూజన్ ‘ఆచార్య’ ను వెంటాడుతున్నట్లు టాక్. ‘ఆచార్య’ విడుదల తేదీ తేలేదాకా మిగతా భారీ సినిమాల రిలీజ్ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంటుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో టాప్ హీరోలు అంతా ‘ఆచార్య’ విడుదల తేదీ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: