యాక్టర్ సురేఖ వాణి మనకి బాగా తెలిసిన నటి. తనదైన శైలిలో సినిమాలోని పంచులతో అందరిని అలరిస్తుంది. ఈమె 1977-6-30 వ తేదీ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టింది. ఈరోజు తన 44 పుట్టినరోజు కావున తన గురించి తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాంసురేఖ వాణి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ యాంకర్ గా, హోస్టుగా ఇలా ఎన్నో రకాలుగా తన సత్తా చాటింది . ఈమె తన స్కూలు విద్యాభ్యాసం నుంచే స్టేజీల పై ఎంతో యాక్టివ్ గా ఉండేది. తను 10+2  చదువుతున్నప్పుడే కాలేజీలో జరిగే కల్చరల్ ప్రోగ్రాంలో ఎంత యాక్టివ్ గా ఉండేది. ఇలా ఈమెకు టీవీలో  యాక్టింగ్ చేయాలని, ఒక మంచి నటిగా గుర్తింపు పొందాలని ఎన్నో కలలు కనేది.ఈమె కు నటన పై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి, ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రోగ్రాం చేసే ఛాన్స్ దక్కించుకొని, టీవీ పరిశ్రమలో సెటిలయ్యారు.. ఇక ఆ తర్వాత "హార్ట్ బీట్"ప్రోగ్రాం తో మంచి యాంకర్ గా గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత"మొగుడ్స్ పెళ్ళామ్స్ "షో చేసి భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ షోకి డైరెక్టర్గా వ్యవహరించింది."సురేష్" అనే టీవీ సీరియల్ డైరెక్టర్ తో కలసి పని చేసేది. ఇక తన కెరీర్  మలుపు తిరగడంతో ఈయన ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి కులాలు వేరు వేరు కావడంతో తమ ఇంట్లో ఒప్పుకోకపోయినా.. కెరీర్ మంచిగా ఉండడం తో తనని పెళ్లి చేసుకున్నది.అలా పెళ్లి చేసుకున్నా సురేఖ వాణి తన పెళ్లి సజావుగా సాగితే గుండు కొట్టించు కుంటాను అని ముక్కుకు ఉందట. దాంతో ఆమె గుండు కొట్టించుకొందట. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ.. పెద్ద స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక తన కూతురుతో వేసి కొన్ని డ్యాన్సులను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా, తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందట. ఒకానొక సమయంలో యూట్యూబ్ ఛానల్ లోని వీడియోస్ డిలీట్ చేయడానికి చాలా కష్టాలు పడిందట. కెరీర్ బాగా సజావుగా సాగుతున్న సమయంలో తన భర్త చనిపోవడంతో ఆమెకు తీరని లోటుగా మారింది. ఏది ఏమైనా భవిష్యత్తులో ఎన్నో మంచి సినిమాల్లో నటించాలని మనం కోరుకుందాం. ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్బాస్ సీజన్ ఫైవ్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: