తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు మంచి మంచి కాన్సెప్ట్ లు మరియు తారాగణంతో తెరకెక్కుతూ ఉంటాయి. సినిమాను తీసే సమయంలో దర్శక నిర్మాతలు కూడా కాన్సెప్ట్ బాగా నచ్చి హిట్ అవుతుందనే నమ్మకంతో బడ్జెట్ గురించి ఆలోచించకుండా, ఎక్కడా రాజీ పడకుండా సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. కానీ తీరా ఆ సినిమాలు విడుదలయ్యాక అనుకోని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూస్తుంటాయి. ప్రేక్షకులు కూడా ఏమిటి మంచి కాన్సెప్ట్ కథ ఉన్న సినిమాలు కూడా హిట్ కాకపోవడం ఏమిటని అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో ఒక మూవీ గురించి ఇప్పుడు మనము తెలుసుకున్నాము.
ఎన్నో అంచనాల మధ్యన 2015 సంవత్సరంలో "కొమరం పులి" విడుదలయింది. ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బేసింది. అయితే ప్రధానంగా ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను ఒకసారి చూద్దాం. అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలను ఒకసారి చూద్దాం.

 * తమిళ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు, రచయిత మరియు దర్శకుడు అయిన ఎస్ జె సూర్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన రెండవ సినిమా ఇది కావడం విశేషం. మొదటిగా ఖుషి సినిమాను తీసి ఇండస్ట్రీ హిట్ ను సాధించాడు.
 
* ఈ సినిమాలో ఎస్ జె సూర్య మూడు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ సినిమాకు రచయితగా, డైరెక్టర్ గా వ్యవహరించాడు. అంతే కాకుండా హుస్సేన్ అనే పాత్రలో కనిపించి అలరించారు.

* పవన్ కళ్యాణ్ తన సినిమా చరిత్రలో మొదటి సారిగా పోలీసు ఆఫీసర్ గా నటించాడు.

* ఈ సినిమా విడుదలకు ముందు ఒక వివ్వడంలో చిక్కుకుంది. సినిమా టైటిల్ "కొమరం పులి" గా పెట్టడం వలన ఆది వాసీ వీరుడు కొమరం భీం మనువడు అభ్యంతరం తెలపడంతో ఈ సినిమా టైటిల్ ను పులి గా మార్చారు.

* ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ వారు ఎంతో నమ్మకంతో 1000 కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.

* ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నీకేష్ పటేల్ హీరోయిన్ గా నటించింది. ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కొంతవరకు సినిమాను కాపాడిందని చెప్పవచ్చు.

* ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ కు మరియు పాత్రల తీరుకు పొంతన లేకుండా ఉంటుంది. డైలాగ్స్ కూడా చాల లౌడ్ గా ఇబ్బందికరంగా ఉండడం ఒక కారణం కావచ్చు.

* ఈ సినిమాలో చూపించిన దృశ్యాలలో గ్రాఫిక్స్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.

*  ఈ సినిమాలో సన్నివేశాల పరంగా ఫైట్స్ బాగున్నప్పటికీ, అవి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విఫలం అయ్యాయని చెప్పాలి.

* ఇందులో పవన్ కళ్యాణ్ చెప్పిన పెద్ద డైలాగులు ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెడతాయి.

* ఇందులో విలన్ ఎక్స్ప్రెషన్స్ మరియు డైలుగులు బాగున్నా, పోకిరి సినిమాలోకి ఆశిష్ విద్యార్థి ని గుర్తుకు తెస్తాయి.

* ఎడిటింగ్ కు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ ని అందంగా చూపించడానికి ట్రై చేసిన సినిమాటోగ్రాఫర్ కొద్దిగా మిగిలిన ఫ్రేమ్స్ ని కూడా కవర్ చేసి ఉండాల్సింది.

* మొత్తానికి ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాగా గుర్తుండిపోతుంది. సినిమా ప్లాట్ బాగున్నా తెరకెక్కించే విధానంలో పొరపాట్లు దొర్లాయి.

మంచి అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన పులి సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: