పవన్ క్రిష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ బడ్జెట్ 120 కోట్లు అన్న ప్రచారం జరుగుతోంది. పవన్ కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా రికార్డు క్రియేట్ చేసిన ఈమూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల చేయాలని భావిస్తూ వచ్చారు.

ఈసినిమా షూటింగ్ 40 శాతం వరకు పూర్తి అవ్వడంతో ఈమూవీ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు విడుదల అవ్వడం ఖాయం అని అనుకున్నారు అంతా. అయితే పవన్ ఆలోచనలలో మార్పు వచ్చి ఇప్పుడు పవన్ నటించే మూవీల లైనప్ కూడ మారడంతో ‘హరిహర వీరమల్లు’ స్థానంలో పవన్ రానా లు కలిసి నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ వచ్చి చేరుతుంది అని అంటున్నారు. అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఉంటే ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ సెప్టెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే కోవిడ్ సెకండ్ వేవ్ అడ్డుతగలడంతో పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ అంతా ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లు ప్రారంభం కావడంతో పవన్ ‘హరిహర వీరమల్లు’ కంటే తాను నటిస్తున్న ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ పై పెట్టాడు అని వార్తలు వస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ ను పట్టుపట్టి మరో మూడు నెలలలో పూర్తిచేసి ఆతరువాత ‘హరిహర వీరమల్లు’ పై దృష్టి పెట్టాలని పవన్ ఆలోచన అని అంటున్నారు.  

ఈవార్తలే నిజం అయితే ‘హరిహర వీరమల్లు’ విడుదల వచ్చే ఏడాది సమ్మర్ కు మాత్రమే అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీకి సంబంధించి భారీ గ్రాఫిక్ వర్క్స్ చాల అవసరం కాబట్టి పవన్ అన్ని విధాల ఆలోచించి ఈ విషయంలో దర్శకుడు క్రిష్ నిర్మాత రత్నం లను ఒప్పిస్తున్నాడని టాక్. దీనికితోడు ఈమూవీ పాన్ ఇండియా మావీగా విడుదల అవుతుంది కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ ఈసినిమా బిజినెస్ కు అన్ని విధాల శ్రేయస్కరం అని పవన్ ఆలోచన అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: