టాలీవుడ్ లో హీరోలు కరోనా  తర్వాత తమ సినిమాలను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తో, వెంకటేష్ నారప్ప సినిమా తో, బాలకృష్ణ అఖండ సినిమాతో, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో, అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో రెడీగా ఉంటూ ప్రేక్షకులను ఊరిస్తున్నారు. స్టార్ హీరోలు కాకుండా మీడియా రేంజ్ హీరోలు కూడా తమ సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. నాని, అక్కినేని నాగచైతన్య, అఖిల్, విశ్వక్సేన్, సత్యదేవ్ వంటి హీరోలు తమ సినిమాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడుదల చేయాలని చూస్తున్నారు.

అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ ఎప్పుడో సిద్ధమై పోగా ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ చేయడానికి ఎదురుచూస్తున్నారు. థియేటర్ లు ఓపెన్ అవగానే ఈ సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కగా ఇండస్ట్రీకి వచ్చి మూడు సినిమాలు చేసిన ఒక్క హిట్ కూడా దక్కని అఖిల్ కు ఈ సినిమా హిట్ ఎంతో అవసరం అయ్యింది. దాంతో ఈ సినిమాను ఎప్పుడేప్పుడు విడుదల చేద్దామనీ చూస్తున్నాడు అఖిల్. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారట. డిసెంబర్ 24న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఇకపోతే అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాను ఈ ఆగస్టు లోనే విడుదల చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి ఒకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా కాగా మరొకటి అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ చద్ధా సింగ్. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో పరిచయం అవుతున్నాడు అక్కినేని నాగ చైతన్య. దీనిని కూడా డిసెంబర్ 24 నే విడుదల చేయబోతున్నాడట. మరి ఈ బ్రదర్స్ కు ఈ సినిమాలు ఏ మేరకు హిట్ ను అందిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: