ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి సినిమాలను వీక్షించారు కానీ అంతలోనే సెకండ్ దూసుకొచ్చింది. దీంతో సినిమా థియేటర్లను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే అటు తెలంగాణలో కూడా థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో మళ్ళీ థియేటర్ల నిర్వాహకులు ఆందోళనలో మునిగిపోయారు. ఇటీవలే థియేటర్లు తెరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. కానీ కొత్త సినిమాలు అందుబాటులో లేకపోవడం అంతేకాకుండా ప్రేక్షకులు అటు థియేటర్ లకి రావడానికి అంతగా మొగ్గుచూపుతుండటంతో ఇక సినిమా హాల్లు తెరిచేందుకు కూడా యాజమాన్యాలు ముందుకు రావడం లేదు.
అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినీ అభిమానులు అందరికీ శుభ వార్త చెప్పింది. ఇప్పటి వరకు కేవలం 50 శాతం సీటింగ్ తో మాత్రమే థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. జూలై 23 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు ఇక 100% సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శించుకోవచ్చు అని నిర్ణయం తీసుకుంది. ఇక ఇది సినీ అభిమానులు అందరికి ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. దీంతో మళ్లీ థియేటర్ మజాని ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రేక్షకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి