క్రేజీ హీరోయిన్ రష్మిక ఇప్పుడు బాలీవుడ్ కు కూడ తాకడంతో అక్కడ ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి. వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆమె అనేక సినిమాలను అంగీకరించడమే కాకుండా తనను బాలీవుడ్ లో ప్రమోట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పిఆర్ టీమ్ ను కూడ ఏర్పాటు చేసుకుంది.


ప్రస్తుతం ఆమె పారితోషికం కోట్లాది రూపాయలలో ఉన్న పరిస్థితులలో ఆమె అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ తన సంపాదనను చాల ముందు చూపుతో రకరకాల పెట్టుబడుల రూపంలో పెడుతున్నట్లు ఒక మీడియా సంస్థ తన ఆసక్తికర కథనంలో పేర్కొంది. రష్మిక వద్ద ప్రస్తుతం మూడు లగ్జరీ కార్లు ఉన్నాయని ఆడి క్యూ3, మెర్సిడెజ్ బెంజ్ సి-క్లాస్ తో పాటు టాలీవుడ్ సెలెబ్రెటీస్ చాలామంది ఇష్టపడే రేంజ్ రోవర్ ఎస్ యూవీ కారు కూడా ఆమె వద్ద ఉన్నట్లు ఆకథనంలో పేర్కొనబడింది.


అంతేకాదు ఇన్నోవా, హుందాయ్ కార్లు కూడ ఆమె వద్ద రష్మిక వద్ద ఉన్నాయట. ఈ కార్లు అన్నింటిని ఆమె తన మూడ్ కు తగ్గట్టు వాడుకుంటూ తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తోందట. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే రష్మిక తన సంపాదనలో కొంత భాగాన్ని తన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న వ్యాపారాలలో పెట్టుబడి పెడుతోందట.


ఈమధ్యనే ఆమె ముంబాయ్ లో అత్యంత ఖరీదైన విల్లా ను కొనుగోలు చేసిందని ముంబాయ్ ముంబాయ్ వెళ్ళినప్పుడు ఆమె తన విలాసవంతమైన విల్లాలోనే ఉంటోందని తెలుస్తోంది. అదేవిధంగా ఆమెకు బెంగుళూరు దగ్గరలో మరొక పెద్ద విల్లా ఉందని వీటితో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో ఆమె ఆస్థులు కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ మెయిన్ టైనేన్స్ విషయానికి వస్తే ఆ కథనంలో పేర్కొనబడిన విషయాలు తెలుసుకుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవుతుంది. రష్మిక ఉండే హ్యాండ్ బ్యాగ్స్ లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖరీదు చేస్తాయని దీనికితోడు ఆమె తన హీల్స్ షూస్ కు కూడ లక్షలలో ఖర్చు చేస్తుందని ఆమె కళ్ళజోడు హ్యాండ్ బ్యాగ్ నుండి షూ వరకు అన్నీ ఇంటర్ నేషనల్ బ్రాండ్స్ వాడుతుందని ఆ కథనం పేర్కొంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: