జిందగీ నా మిలేగీ దుబారా ఫేమ్ అభయ్‌ దేఓల్ నటిస్తున్న "స్పిన్" అనే ఒక అమెరికన్ టీన్ డ్రామా త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం రియా అనే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. అవంతిక వందనపు అనే నటీమణి ఈ సినిమాలో రియా అనే ఇండియన్ అమెరికన్ పాత్ర చేస్తుంది. అవంతిక వందనపు నిజజీవితంలోనూ ఇండియన్ అమెరికనే..! ఆమె కాలిఫోర్నియాలో జన్మించారు. తొలిసారిగా ఒక ఇండో-అమెరికన్ ఫిలిం లో ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తెలుగులో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో కనిపించారు. ప్రేమమ్ సినిమా లో మడోన్నా సెబాస్టియన్ కి యంగ్ వర్షన్ గా ఆమె కనిపించింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా లో చిన్న బ్రమరాంబ గా నటించారు. అజ్ఞాతవాసి, బ్రహ్మోత్సవం ఆక్సిజన్ వంటి ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. ఇక ఫార్టూన్ ఆయిల్ వంటి వాణిజ్య ప్రకటనల్లో కూడా ఆమె కనిపించారు.



ఈ చిత్రంలో అవంతిక వందనపు దక్షిణ భారతదేశ సంస్కృతులు, ఇతర దేశాల సంస్కృతులు మిక్స్ చేసి డీజే సంగీతం సృష్టిస్తుంది. అయితే ఆమెతో పాటు ఇతర డీజే స్టార్స్ కూడా ఉంటారు. వారంతా కూడా విదేశీ యాక్టర్స్ కావడం గమనార్హం. అభయ్‌ రియా తండ్రి పాత్ర పోషించారు. దీన్ని డిస్నీ ఛానల్ వారు నిర్మించారు. ఇది డిస్నీ ఛానల్ ఒరిజినల్ మూవీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మంజారి మకిజనీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. అమెరికాలో ఆగస్టు 13వ తేదీన ఇండియాలో ఆగస్ట్ 15 వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రీమియం లో ఆగస్టు 15 మధ్యాహ్నం 12 గంటల సమయంలో "స్పిన్" మూవీ ప్రసారం కానుంది.



మరి ఈ సినిమాతో అవంతిక ఇండియన్ ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో చూడాలి. ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఈ సినిమాలో అమెరికన్ సంస్కృతులు దక్షిణభారత సంస్కృతులు ఒకే సారి చూడొచ్చు. అటు అమెరికా ఆడియన్స్, ఇటు ఇండియా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే విధంగా డైరెక్టర్ స్పిన్ సినిమాని రూపొందించారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: