ఇప్పటికే సంక్రాంతి రేసులో ప్రభాస్, పవన్, మహేష్ సినిమాల సందడి కన్ఫర్మ్ చేయగా ఇక లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ కూడా 2022 పొంగల్ వార్ లో సిద్ధం అంటున్నాడు. లేటెస్ట్ గా జరిగిన నారప్ప సక్సెస్ మీట్ లో వెంకటేష్ f3 సినిమా థియేటర్లోనే చూస్తారని సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. అప్పటివరకు f3 ఎప్పుడు వస్తుంది అని ఎక్సయిటింగ్ గా ఉన్న దగ్గుబాటి ఫ్యాన్స్ కు సంక్రాంతికి f3 హంగామా షురూ కానుందని తెలుస్తుంది.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో f2 అంటూ వచ్చి ఆడియెన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేశారు వెంకటేష్, వరుణ్ తేజ్. మళ్లీ అదే కాంబో రిపీట్ అవుతూ f3 గా రాబోతున్నారు. ఈ మూవీ కూడా పక్కా ఎంటర్టైన్ అందిస్తుందని చెబుతున్నారు. నారప్ప సక్సెస్ మీట్ లో మాట్లాడిన వెంకటేష్ నారప్పని ప్రైం లో రిలీజ్ చేసినందుకు తన ఫ్యాన్స్ కు మరోసారి సారీ చెప్పారు. థియేటర్ లో వచ్చే సినిమాలు చాలా ఉన్నాయని. f3 సంక్రాంతికి వచ్చి అలరిస్తుందని టంగ్ స్లిప్ అయ్యారు వెంకటేష్. మొన్నటివరకు ఈ ఏడాది చివరన ఈ సినిమా వస్తుందని భావించిన f3 ఇప్పుడు సంక్రాంతి రేసుకి రెడీ అవుతుంది.

సంక్రాంతికి ఎన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినా f3 మాత్రం పక్కా హిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీతో అనీల్ రావిపుడి మరోసారి తన మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు. f3 మూవీలో సునీల్ కూడా తన కామెడీతో అలరిస్తాడని అంటున్నారు. తప్పకుండా వెంకటేష్, వరుణ్ తేజ్ ల f3 సంక్రాంతికి హంగామా చేయడంలో ముందు ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. నారప్ప సక్సెస్ మీట్ లో కేవలం ఎఫ్ 3 థియేటర్ లో వస్తుందని చెప్పాడు అంటే దృశ్యం 2 కూడా ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ చేశాడు వెనక్టేష్. దృశ్యం 2 మాత్రం డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: