ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణతో,  శ్రీదేవి మొదట మా నాన్న నిర్దోషి అనే సినిమాలో కృష్ణ కూతురిగా  బాలనటిగా నటించి, తర్వాత కృష్ణ తో బుర్రిపాలెం బుల్లోడు సినిమా తో జోడీ గా జత కట్టింది. ఇక్కడ కూడా అలాగే బాలయ్యతో మొదట కూతురిగా నటించి , ఆ తర్వాత ఆయనతో కలిసి రొమాన్స్ చేసింది.. ఆమె ఎవరు..? ఏయే సినిమాల్లో నటించింది.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1989వ సంవత్సరంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాలగోపాలుడు.ఈ  సినిమాలో హీరోగా బాలకృష్ణ నటించగా, హీరోయిన్ గా సుహాసినీ నటించింది. అంతేకాదు తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఇందులో బాలకృష్ణ తో పాటు మరో ఇద్దరు పిల్లలను కూడా మనం గమనించే ఉంటాము..  వారిలోఒకరు కళ్యాణ్ రామ్  అయితే మరొకరు స్టార్ హీరోయిన్ రాశి.
ఇక ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి బాల నటీనటులుగా నటించి, ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అప్పట్లోనే మెప్పించారు. ఇక ఈ సినిమా బాలకృష్ణ సినీ కెరియర్ ని మార్చేసిందని చెప్పవచ్చు. బాలనటుడిగా నటించిన కళ్యాణ్ రామ్ , రాశి లకు కూడా మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత నందమూరి వారసుడిగా కళ్యాణ్ రామ్.. హీరోగా సినీ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో అడుగుపెట్టాడు. తర్వాత పటాస్ , హరే రామ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అటు హీరోగా, ఇటు నిర్మాతగా ఎన్టీఆర్ సినిమాలను నిర్మిస్తూ, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

ఇక  సినిమాలో బాలకృష్ణకు కూతురీ పాత్రలో నటించిన రాశి, దాదాపు పది సంవత్సరాల తర్వాత ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన.." కృష్ణ బాబు" అనే చిత్రంలో బాలయ్యకు జోడీగా నటించింది. మొదట బాలకృష్ణ కూతురు గా నటించి, ఆ తరువాత జోడిగా నటించడంతో అందరూ అప్పట్లో ఆశ్చర్యపోయారు. రాశి అటు కూతురిగా పెద్దయ్యాక ఆయన సరసన రొమాన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్య పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: