రాజమౌళి బాహుబలి తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

టాలీవుడ్ లో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడని తెలుస్తుంది. గత మూడు సంవత్సరాలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమా కోసం రాత్రిపగలు కష్టపడుతున్నారని సమాచారం.

ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని రాజమౌళి నుండి విముక్తి పొందారట. దీంతో ఈ స్టార్స్ ఇద్దరు తమ తరువాత ప్రాజెక్ట్స్ ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం. ఈ విషయంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కంటే కాస్త ముందు ఉన్నాడట. రామ్ చరణ్ అటు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తూనే ఇటు తండ్రి సినిమా ఆచార్య లో కూడా ముఖ్య పాత్ర చేసిన సంగతి తెలిసిందే..

దీంతో పాటు ఇప్పుడు శంకర్ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లబోతున్నాడని సమాచారం.

సెప్టెంబర్ 8న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను స్టార్ట్ చెయ్యబోతున్నారట. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్ రాజు పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ కు జోడీగా నటిస్తుందని సమాచారం. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే సుజిత్ లేదా గౌతమ్ తిన్ననూరి లలో ఎవరో ఒకరితో సినిమా చేయబోతున్నాడని వార్త  వినిపిస్తుంది.అయితే ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన సినిమాల గురించి ప్రకటించాడు. ఈ సినిమా పూర్తి అయ్యింది కాబట్టి వెంటనే కొరటాల శివ తో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా అక్టోబర్ వరకు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపించడం లేదని సమాచారం. ఎందుకంటే కొరటాల ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడట. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి పూర్తి అయినా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట .
ఏదిఏమైనా ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోతారని తెలుస్తుంది. అందుకే అన్ని పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతూ ఆ స్టార్ డమ్ ను కాపాడుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కొద్దిగా ముందు వరుసలో ఉన్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: