ప్రస్తుతం 'ఓటిటి' కల్చర్ చాలా బాగా పెరిగింది. కరోనాకు మందు ఈ కల్చర్ కు జనాలు పెద్దగా అలవాటు పడలేదు. దేశంలో కరోనా విజృంభించడంతో  ప్రభుత్వాలు థియేటర్లను మూసివేయాలని, మరియు అనవసరంగా బయట తిరగవద్దు అంటూ ఆంక్షలను విధించారు. అలాంటి పరిస్థితులలో కుటుంబమంతా కూర్చొని సరదాగా సినిమాలు, వెబ్ సిరీస్ లో చూడడానికి 'ఓటిటి' లు పెద్దదిక్కుగా మారాయి. దీనితో అనేక మంది డబ్బులు కట్టి 'ఓటిటి' లను వాడడం మొదలుపెట్టారు. అలాగే థియేటర్లలో విడుదల కాని సినిమాలకు కూడా 'ఓటిటి' లే దిక్కుగా మారాయి. ఇలా 'ఓటిటి' సంస్థల మధ్య కాంపిటేషన్ పెరగడంతో ప్రతి వారం కొత్త కొత్త కంటెంట్ తో 'ఓటిటి' సంస్థలు జనాల ముందుకు వస్తున్నాయి.

 అయితే గత వారం తెలుగు ప్రముఖ ఓటీపీ సంస్థ అయిన ఆహ 'ద బేకర్ అండ్ ది బ్యూటీ' అనే వెబ్ సిరీస్ ను జనాల ముందుకు తీసుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో సంతోష్ శోభన్ , టీనా , వెంకట్ , ఝాన్సీ , శ్రీకాంత్ అయ్యంగార్ , విష్ణు ప్రియ, సంగీత్ శోభన్ , సాయి శ్వేతా ప్రముఖ పాత్రలు పోషించారు. అయితే పోయిన వారం నుండి ఆహా లో స్ట్రీమ్మింగ్ అవుతున్నా ఈ వెబ్ సిరీస్ జనాల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ముందుకు దూసుకుపోతోంది. ఇలా ప్రజల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్ పై టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్ . ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది అని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: