తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కమర్షియల్ దర్శకులు ఉన్నారు..  భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే ఎంత మంది స్టార్ దర్శకులు ఉన్నప్పటికీ అటు శేఖర్ కమ్ముల కి మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫీల్ గుడ్  సినిమాలకు శేఖర్ కమ్ముల కేరాఫ్ అడ్రస్. వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా శేఖర్ కమ్ముల సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా శేఖర్ కమ్ముల సినిమాలో భారీ తారాగణం ఎక్కడా కనిపించరు.  ఎక్కువగా కొత్త వాళ్లతోనే సినిమాలు తీయడానికి శేఖర్ కమ్ముల ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో శేఖర్ కమ్ముల  ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇండస్ట్రీ   మొత్తం కమర్షియల్ సినిమాల వెంట పరుగులు పెడుతున్న సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఫీల్ గుడ్ సినిమాలను అందిస్తూ అంతకంతకు క్రేజ్ సంపాదించుకున్నాడు శేఖర్ కమ్ముల. ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగి పోతూనే ఉంటాయి.అయితే ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి మనిషిగా కూడా శేఖర్ కమ్ముల ఎంతో గుర్తింపు సంపాదించాడు. ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఒక గొప్ప మనిషిగా పేరు సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. ఇక ఇటీవల మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేలమర్రి కి చెందిన రైతు లక్ష్మయ్య భూమి అమ్మగా వచ్చిన డబ్బులు చివరికి అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో రైతు కష్టాల్లో పడిపోయాడు. ఆదుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశాడు. అయితే ఆ రైతుకు అండగా నిలిచాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని ఒక చానల్ ద్వారా తెలుసుకున్న శేఖర్ కమ్ముల స్పందించి రైతుకు ఆర్థిక సహాయం అందించాడు. లక్ష రూపాయలు రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా ట్రాన్స్ఫర్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: