పూరి జగన్నాథ్ మొదట్లో ఎంతటి సెన్సేషనల్ కలిగించే సినిమాలను తెరకెక్కించాడో అందరికీ తెలిసిందే. ఆయన ప్రతి సినిమా కూడా అణిముత్యంలా ఉండేది. పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు సినిమా లో ఉన్నది ఏ హీరో అయినా కూడా అందరి హీరోల అభిమానులు ఆ సినిమాకు తరలివచ్చి పూరి జగన్నాథ్ సినిమా ను తిలకించే వారు. అలా అందరి హీరోల అభిమానులను తన అభిమానులు గా ఏర్పరచుకున్న పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో పూర్వ వైభవాన్ని కోల్పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఆయన సినిమాలు కూడా గత సినిమాల రేంజ్ లో లేకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. ఇటీవల ఇష్మార్ట్ శంకర్ సినిమా తో వచ్చి గతవైభవం తెచ్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్న పూరి ఈ సినిమాను తెరకెక్కించి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కలని  చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పూరి గురించి ఇటీవల రాజమౌళి పొగుడుతూ మాట్లాడడం పట్ల కొంత మంది కొన్ని రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఆంజనేయుడికి తన బలం తనకు తెలియదు.. ఎవరైనా గుర్తు చేస్తే తాను బలవంతుడు అవుతాడు అన్నట్లు పూరిజగన్నాథ్ తన బలం తెలిసిన దాన్ని ఉపయోగించు కాకుండా ఇంకో రూట్లో వెళుతూ తన బలాన్ని పక్కన పెడుతూ ఉంటాడు. ఆ విధంగా పూరి జగన్నాథ్ తన కెరీర్లో ఎన్నో ఫ్లాపులను చవిచూశాడు. తన ఫార్ములాను పక్కన పెట్టి తీసిన ప్రతి సినిమా కూడా ఆ విధంగానే భారీ ఫ్లాప్ అయింది. హీరోలను సరికొత్తగా చూపిస్తూ వారి ఇమేజ్ ను అమాంతం మార్చేసే పూరి జగన్నాథ్ ఇప్పుడు ఫామ్లోకి రావడం వారి అభిమానులకు సంతోషంగానే ఉన్నా లైగర్ సినిమా హిట్ అయితే ఆయనకు గత వైభవం రావడం ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ రేంజిలో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: