తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత డైరెక్టర్ కోటి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సంగీతంతోనే కాకుండా నటుడిగా, గాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో మంది గాయకులకు ప్రోత్సహాన్ని అందిస్తూ వారికీ గురువుగా మారారు. ఆయన మ్యూజిక్ చేసిన పాటలు అన్ని ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఆదరణ పొందాయి. ఆయన ఒక్కవైపు సినిమాలకు సంగీతం ఆందోస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ లు చేశాడు. కానీ ఆయనకు కాలం కలిసిరాక బిజినెస్ నష్టపోయారు.

ఇక కోటి వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు. తాను స్కూల్ డేస్ లో ఓ అమ్మాయిని లవ్ చేశారని ఆమెకి ప్రపోజ్ చేయడానికి భయం అవ్వడంతో తనకు చెప్పలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయనకీ ఓ కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక కోటి కొడుకు కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇక కోటి మ్యూజిక్ విషయానికి వస్తే.. ఆయన ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలకు బ్లాక్‌ బస్టర్‌ సాంగ్స్‌ను ఇచ్చారు.

అయితే అప్పట్లో మెగాస్టార్‌ చిరంజీవి - కోటి కాంబినేషన్‌లో పదహారేళ్ల వయసు, అందమా అందుమా, ప్రియ రాగాలే వంటి ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందాయి. మెగాస్టార్‌ చిరంజీవి - కోటికి మంచి అనుబంధం ఉండేది. కాగా.. ఓ సంఘటన కారణంగా కొంత గ్యాప్‌ వచ్చిందని కోటి వెల్లడించారు. అయితే వారికీ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో వెల్లడించారు.

ఇక అసలు విషయానికి వస్తే.. 'ఓ సినిమా 100డేస్‌ ఫంక్షన్‌ ఓంగోలులో నిర్వహించారు. ఈ సినిమా ఫంక్షన్ మా అత్తగారి ఊరు కావడంతో ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆయనకు అనుకోకుండా హై ఫీవర్ రావడంతో ఫంక్షన్‌కు రాలేకపోయానని తెలిపారు. అయితే నేను కావాలనే ఫంక్షన్‌కు రాలేదని కొందరు చిరంజీవికి ఉన్నవి, లేనివి చెప్పారని అన్నారు. ఇక అసలు విషయం చెప్పడానికి చిరంజీవి ఆఫీస్ కి వెళ్తే మాట్లాడే మూడ్ లో లేనని చెప్పారని తెలిపారు. చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా తరువత అతడితో కలిసి పని చేయలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: