టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో 2021లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కు ముఖ్యంగా పూజాహెగ్దే, ర‌ష్మికా మంద‌న్నా, సాయిప‌ల్ల‌విల పేర్లు వినిపిస్తున్నాయి. సీనియ‌ర్ స్టార్ హీరోయిన్‌ల హ‌వా త‌గ్గ‌డంతో ఈ ముగ్గురు హీరోయిన్‌ల‌కే ప్రేక్ష‌కుల‌లో ప్ర‌స్తుతం క్రేజీ ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు ఈ హీరోయిన్‌లు న‌టించిన సినిమాలు ఎక్కువ‌గా విజ‌యం వైపు దూసుకెళ్లుతున్నాయి.

కృతిశెట్టి ఈ హీరోయిన్‌ల‌కు పోటీని ఇస్తున్నా.. ఆమె న‌టించే సినిమాలు హిట్ అయితేనే ఆమె ఈస్టార్ హీరోయిన్‌ల రేస్‌లో నిలిచే అవ‌కాశం ఉంది. ఈ 2021 సంవ‌త్స‌రం లో మాత్రం ఆ ఛాన్స్ ఇంకా లేదు. గ‌త ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో స‌క్సెస్ అందుకున్న ర‌ష్మిక మంద‌న్నా ఈ సంవ‌త్స‌రం కూడా పుష్ప‌తో విజ‌యం అందుకున్నారు. మ‌రొక సినిమా అయిన ఆడ‌వాళ్లుమీకు జోహార్లు అనే చిత్రంలో కూడా న‌టిస్తోంది ర‌ష్మిక‌. ముఖ్యంగా కొత్త సినిమా ఆఫ‌ర్లు వ‌స్తున్నా.. ఈ హీరోయిన్ మాత్రం ఆచితూచి న‌టిగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాల‌ను మాత్ర‌మే ఎంపిక చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, అలా వైకుంఠ‌పురం సినిమాల‌తో విజ‌యం అందుకున్న పూజాహెగ్దే న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15, 2021న విడుద‌లైన విష‌యం విధిత‌మే. అయితే  అది యావ‌రేజ్‌గానే ఆడింది. కాక‌పోతే  పూజా న‌ట‌న‌కు ప్ల‌స్ అయింది. మ‌రోవైపు పూజా న‌టించిన‌ రాధేశ్యామ్ వ‌చ్చే సంవ‌త్స‌రం సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వ్వ‌నుంది. పూజా వ‌రుస విజ‌యాల‌తో పూజాహెగ్దెకు ప్ల‌స్ అవుతున్నా.. ముఖ్యంగా త్రివిక్ర‌మ్ సినిమాల‌తోనే విజ‌యాల‌ను ఎక్కువ‌గా సొంతం చేసుకుంటున్నార‌ని, పూజాహెగ్దె మ‌రిన్ని విజ‌యాలు ద‌క్కించుకుంటే నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా నిలుస్తారు అని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

 మ‌రోవైపు సాయిప‌ల్ల‌వి చేతిలో ఎక్కువ సంఖ్య‌లో సినిమాలు ఉన్నా వ‌రుస విజ‌యాల‌ను ఆమె సొంతం చేసుకోక‌పోవ‌డం కెరీర్‌కు మైన‌స్ అయింది. అయితే సాయిప‌ల్ల‌వి న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ డిసెంబ‌ర్ 24న విడుద‌లై మంచి టాక్ వినిపిస్తోంది. ఈమె ఖాతాలో మ‌రొక విజ‌యం ద‌క్కింద‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే 2021లో టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ మాత్రం ర‌ష్మిక అనే చాలా మంది అంటున్నారు. మ‌రి భ‌విష్య‌త్‌లో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఏ హీరోయిన్ నెంబ‌ర్ వ‌న్ రేసులోకి వ‌స్తుందో వేచి చూడాలి మ‌రీ.


మరింత సమాచారం తెలుసుకోండి: