ఎఫ్3 అంటే సినిమా అని అనుకోకండి.. అది ఒక సెలూన్ పేరు. సినీ పరిశ్రమలకు బాగా ఫెవరెట్ ఇది. ప్రతి ఒక్క సెలెబ్రిటీలు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే చాలా సెలూన్ లు ఉన్నాయి. ఇప్పుడు మరో సెలూన్ ను చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ప్రారంభించారు.ఎఫ్‌3 సెలూన్ కొత్త బ్రాంచి హైటెక్ సిటీ సమీపంలో ఆదివారం ప్రారంభమైంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని సమక్షంలో ఈ సెలూన్ ప్రారంభించారు.


కొత్త బ్రాంచి చాలా ప్రత్యెకమైనది.2వేల చదరపు అడుగుల విశాల ప్రదేశంలో, అత్యంత అధునాతన పరికరాలతో కస్టమర్లు ఎప్పుడూ చూడని అనుభూతి ని కలిగిస్తుంది. చాలా కాలం నుంచి సెలూన్ ఎఫ్3 కి మంచి డిమాండ్ ఉంది.ఎఫ్‌3 సెలూన్లు సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అందరికీ హాట్ ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. అత్యంత అధునాతన హెయిర్ స్టైళలు, ఇతర సేవలు అందించడం ద్వారా కస్టమర్లకు మంచి సంతృప్తిని కలిగిస్తుంది. ప్రత్యేక ఏర్పాట్లు అనేది అందరినీ ఆకర్షిస్తాయని సెలూన్ యాజమాన్యం చెబుతుంది.


పార్టీలకు వెళ్లాలని, వాటిలో బాగా కనిపించాలని అనుకునే వారికి ఎఫ్3 సెలూన్లు అత్యుత్తమ సేవలు అందిస్తాయి. స్వయంగా నేను ప్యారిస్‌లో శిక్షణ పొందాను, ఎఫ్‌3 సెలూన్‌లో ఉన్న సిబ్బంది అందరూ మంచి శిక్షణ పొందారు. అనుకున్న విధంగా వారిని తయారు చేసి చూపించడం వారి ప్రత్యేకత అని చెబుతున్నారు. అందుకే సినీ స్టార్స్ నుంచి సాదారణ వ్యక్తులు కూడా ఇక్కడ రెడీ అవుతారు.ఇది ఇలా ఉండగా..దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకుడిగా ఎఫ్ 3 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఎఫ్2 సినిమాకు సిక్వెల్ గా ఈ సినిమా రానుంది.2022 న ఎప్రిల్ లో విడుదల కానుంది. ఆ సినిమా ఎలాంటి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: