ఆ నీలి నీలి గగనం శత విస్పులింగమయమై..అని వింటూ ఉండండి.. అగ్ని ధాతువుల చెంత దేశ ఔన్నత్య పతాక రెపరెలు చూడండి.. మనం ఆ గగన వీధుల్లో శౌర్యం పరాక్రమం అన్నవి ఎన్నడూ వీక్షించిన సందర్భాలు ఉండవు.. నేలపై నడయాడే శౌర్యానికి సంకేతం ఒక సైనికుడు.. నింగిలో నడయాడే కీర్తికి దార్శినిక తేజం మరో వీరత్వం.. ఈ రెండూ మనలోనే మనతోనే.. ఈ నేల తల్లికి ప్రణమిల్లి ప్రియ భారతావనికి జేజేలు పలికి ఆ స్వర సుప్రభాత సేవలను ప్రతిరోజూ స్మరించడం ఓ బాధ్యత.
దేశం గర్వించే ఏ పని చేసినా మన తెలుగు వాడు అందుకు కారణం అయి ఉండాలి.. దేశం తలెత్తుకునే ఏ పొగరు అయినా అందులో మన వాటా తప్పక ఉండాలి.. మనం మననం చేసుకోదగ్గ ఖ్యాతికీ, మనం విస్తృతం చేసుకోదగ్గ కీర్తికి గొప్ప సంకేతం ఈ సినిమా కావాలి.. జననీ పాట మరో సారి వినండి. ఈ దేశం సాధించాల్సిన విజయాలు దగ్గర, సాధించిన స్వేచ్ఛ దగ్గర మనం ఎలా ఉండాలి ఎలా ఉన్నాం అన్నదే మరో మారు ప్రియ భారతావని స్మరణ.. ఈ పాటలో ఈ పాటతో!
దవళ వస్త్ర కాంతులలో చిన్నారులు ఈ పాట ను తమిళ్ వెర్షన్లో ఆలపిస్తున్నారు. మదన్ కార్కీ ఈ పాటకు తమిళ సాహిత్యం అందించారు అని విన్నాను. ఆ పాట ఆలపిస్తున్నంత సేపు రాజమౌళి గొప్ప భావోద్వేగంలో ఉండిపోయారు.. చిన్నారులతో కలిసి ఆ యువ కవి తన గీతాలాపన చేస్తూ ఉన్నారు. నిష్కళంక చరితం ఏదయినా ఉందా ఆ చరితను మనం ప్రేమించడం నేర్చుకుంటున్నా మా.. వింటూ పొంగిపోయాను.. పాట వింటూ స్మరిస్తూ ఉన్నాను నా తల్లినీ ఈ దేశాన్నీ.. మీరంతా ఈ పాట మరో సారి వినండి.. ఉద్వేగ దుందుభిని మీరు ప్రేమించండి.. స్వర వాణి కీరవాణి సాహిత్యానికి మరొక్కసారి వందనం. జైహింద్ …
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి