సినిమాల్లో బాలకృష్ణ చెప్పే డైలాగులు అయితే మాస్ ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తూ ఉంటాయి. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో గా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ ఇటీవలే హోస్ట్ గా అవతారం ఎత్తి తనలోని మరో కోణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆహా ఓటీటీ వేదికగా unstoppable అనే కార్యక్రమంలో యాంకర్గా అవతారమెత్తారు నందమూరి బాలకృష్ణ. ఇక ప్రతి ఎపిసోడ్ లో ఎంతో మంది సినీ ప్రముఖులను గెస్ట్లుగా పిలుస్తూ ఇక వారిని చిలిపి ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులందరికీ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు.
ఇక unstoppable కార్యక్రమంలో బాలకృష్ణ వాక్చాతుర్యం చూస్తూ ఉంటే ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ యాంకర్లు కూడా పనికిరారు అని అనిపిస్తూ ఉంటుంది. 60 ఏళ్ళు దాటిపోతున్నా ఇంకా వ్యాఖ్యాతగా ఎంతో జోష్ చూపిస్తూ అదరగొడుతున్నారు. ఇకపోతే ఇటీవలే unstoppable కార్యక్రమానికి పూరి జగన్నాథ్ తో పాటు లైగర్ చిత్ర బృందం వచ్చింది. ఇక ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ తీసిన పైసా వసూల్ అనే సినిమా గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. ఆ సినిమాలో డైలాగులు అద్భుతంగా ఉంటాయి అంటూ పూరి జగన్నాథ్ ను మెచ్చుకున్నారు. ఇంతలోనే పైసా వసూల్ సినిమాలోని ఒక డైలాగ్ చెబుతూ నేను ఎంత ఎదవనో నాకే తెలియదు.. కానీ ఇలా ఎవరైనా అంటే వాళ్ళని చంపేస్తా అంటూ బాలకృష్ణ డైలాగ్ చెబుతాడు. దీంతో పూరి జగన్నాథ్ బాలకృష్ణ ఇద్దరు నవ్వుకుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి