2016 వ సంవత్సరంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం 'బంగార్రాజు'. 'మనం' లాంటి మెమోరబుల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నాగచైతన్య-నాగార్జున కలిసి పూర్తిస్థాయిలో నటించిన మొదటి చిత్రమిది.ఈ సంక్రాంతి పండక్కి విడుదల అయ్యి అన్ని చోట్ల మంచి బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని ఈ సంక్రాంతికి సరైన సినిమాగా ఈ సినిమా నిలిచింది.ఈ సినిమాలో ఇంత దమ్ముంది కాబట్టే నాగార్జున కరోనా అని కూడా తగ్గకుండా ధైర్యంగా థియేటర్ లలో రిలీజ్ చేశాడు.

ఇక కింగ్ నాగార్జున ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ లో కనిపించి ఎంతగానో అలరించాడు. ముఖ్యంగా రాముగా ముసలి గెటప్ లో గ్రే హెయిర్ లో కనిపించే నాగార్జున లుక్ చాలా సూపర్ గా ఉంటుంది.అలాగే మన టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నాగచైతన్య చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు.ఈ సినిమాలో చైతూ డిఫరెంట్ వేరియేషన్స్ ను చాలా చక్కగా పలికించాడు. అలాగే రమ్యకృష్ణ రోల్ కూడా చాలా కీలకంగా చెప్పుకోవాలి.తన ఎలివేషన్ ను అలాగే చాలా బాగా మైంటైన్ చేసింది రమ్యకృష్ణ. ఇక యంగ్ బ్యూటీ కృతిశెట్టి ఎక్స్ ప్రెసివ్ గా నటించింది కానీ.. అమ్మాయి ముఖంలో మునుపటి కళ అయితే కనబడలేదు. సంపత్ రాజ్, రావు రమేష్, ప్రవీణ్, రోహిణి తదితరులు తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు.

కళ్యాణ్ కృష్ణ ఈ కథ రాయడానికి దాదాపుగా నాలుగు సంవత్సరాల టైం తీసుకున్నాడు. ఒకానొక సందర్భంలో అయితే అసలు ఇక ఈ సినిమా సీక్వెల్ ఉండదు ఏమో ఫిక్స్ అయిపోయారు కొందరు. అలాంటిది తను రాసిన కథతో నాగార్జునను బాగా మెప్పించి,ఈ సినిమా తెరకెక్కించి, ఇంకా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని, దర్శకుడిగా ఇంకా కథకుడిగా తన సత్తా చాటుకున్నాడు. నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్ సీన్స్ తో అక్కినేని అభిమానులను మాత్రమే కాక ప్రతి హీరో అభిమానులను ఇంకా ప్రతి తెలుగు ప్రేక్షకుడ్ని సంతుష్టులను చేశాడు కళ్యాణ్ కృష్ణ.

ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అసలు ఒక్క ట్యూన్ ను ఇన్ని రకాలుగా వినిపించొచ్చా అని గట్టి షాక్ ఇచ్చాడు అనూప్ రూబెన్స్. దాదాపు ప్రతి పాట ఒకేలా ఉన్నా.. పిక్చరైజేషన్ పుణ్యమా అని ప్రేక్షకులు ఐతే పట్టించుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా కొత్తగా ఇచ్చాడు. యువరాజ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఇంకా సీజీ వర్క్ అయితే సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.అలాగే సునామీ ఎపిసోడ్ ఇంకా స్నేక్ ఫైట్ అయితే ఆడియన్స్ ని చాలా బాగా ఆకట్టుకున్నాయి.

ఖచ్చితంగా ఇది అక్కినేని కాంపౌండ్ కి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.నిజంగా ఇది దమ్మున్న సినిమా. కంటెంట్ బాగుంటే కరోనా కూడా ఆపలేదని బంగార్రాజు నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: