గురు ' మరియు ' ఆకాశం నీ హద్దురా ' సినిమాలతో దక్షిణాది ఇండస్ట్రీని బాగా ఆకర్షించిన దర్శకురాలు సుధా కొంగర. 'ఆకాశం నీ హద్దురా ' చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది

దీంతో ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు.గతేడాది జులైలోనే ఆ రీమేక్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోందట.. ఆ రీమేక్‌కు కూడా సుధనే దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం.. సూర్య సొంత నిర్మాణ సంస్థ అయిన '' 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ '' ఆ రీమేక్‌కు నిర్మాతగా వ్యవహరిస్తుంది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.

'' సినిమాలకు భాషతో అస్సలు సంబంధం లేదు. సరిహద్దులు తొలగిపోతున్నాయి. ఓటీటీలు ప్రపంచం మొత్తాన్ని ఏకం చేశాయి. 'ఆకాశం నీ హద్దురా' సినిమాని థియేటర్ల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసాము.కానీ, కరోనా రావడంతో ఆ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయాల్సి వచ్చింది.ఆ చిత్రం రిలీజ్ కాగానే అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. హిందీ రీమేక్‌కు భారత్‌లోని ఏ ప్రాంతానికి చెందిన యాస ఉపయోగించాలని మేము ఆలోచిస్తున్నాం. స్క్రిఫ్ట్‌ రెడీ కావాలి అప్పుడే నటుడిని మేము సంప్రదిస్తాం. దక్షిణాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ' ఆకాశం నీ హద్దురా ' సినిమాను మేము రూపొందించాం. బాలీవుడ్ ప్రేకకులకు అనుగుణంగా దానిని కొద్దిగా మార్చాలి. ఆ సినిమా పాన్ ఇండియా స్టోరీ '' అని సుధా కొంగర చెప్పారట..

రీమేక్ అనంతరం మహేశ్ బాబు మరియు అల్లు అర్జున్ అలాగే హృతిక్ రోషన్‌లతో సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఆమె వివరించారు. రిటైర్డ్ ఆర్మీ కెఫ్టెన్ జీఆర్. గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని 'ఆకాశం నీ హద్దురా ' సినిమా తెలుగులో కూడా ఘన విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: