కరోనా నేపథ్యంలో ప్రస్తుతం హిందీ సినిమాలను ఎక్కువగా.. ఓటిటి లో విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో థియేటర్ లో విడుదలైన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కడం లేదు.. అందుచేతనే సినిమా మేకర్స్ మొత్తం ఓటిటీలో సినిమాలను విడుదల చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.ఇప్పుడు తాజాగా డైరెక్టర్ శకున్ భత్రా  తెరకెక్కించిన ''గెహ్రైయాన్" సినిమాను కూడా ఓటీటీ లోనే విడుదల చేయబోతున్నారు. ఇందులో కథానాయికగా దీపికా పడుకొనే.. అనన్య పాండే తో పాటు.. సిద్ధాంత్ చతుర్వేది ముఖ్యమైన క్యారెక్టర్లను నటించారు.

ఈ మూవీని వామ్ కామ్ 18 స్టూడియోస్ బ్యానర్ పై ధర్మ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మించిన జరిగింది. ఈ సినిమాని తాజాగా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేనెల ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించి తాజాగా ఒక ట్రైలర్ కూడా విడుదల చేశారు చిత్ర మేకర్స్. 
అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. కేవలం ముగ్గురు పాత్రల మధ్య భావోద్వేగాలు.. విచిత్రమైన బంధాలు కలిగిన కొన్ని జంటల మధ్య సాగే ఒక వైవిధ్యమైన కథ అని తెలుస్తోంది. ఒక భర్త తను తన భార్య పట్ల నిర్లక్ష్యంగా ఉండి జీవించడం తో ఆ భార్య ఎలాంటి ఇబ్బందులు పడుతోంది అనే ఈ కోణంలో ఈ సినిమా కథను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.అయితే ఈ సినిమా కథలో ఎక్కువగా రొమాన్స్, హాట్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా దీపికా పడుకొని.. తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది. బికినీ ట్రీట్ ఇస్తూ లిప్ లాక్ కిస్ లతో ప్రేక్షకులను అభిమానులను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఇక ఈ సినిమాలో దీపిక ఫర్ఫార్మెన్స్ బాగా చేసిందని చెప్పవచ్చు. మరొకవైపు సిద్ధాంత్ అనన్య పాండే కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: