సినిమా అంటే ఓ ప్ర‌యోజ‌నం అని న‌మ్మే ద‌ర్శ‌కుల్లో ఎన్.శంక‌ర్ ఒక‌రు. ఆయ‌న సినిమాల్లో క‌థా వ‌స్తువు అంతా స‌మాజాన్ని ద‌ర్ప‌ణం ప‌ట్టే విధంగానే ఉంటుంది.అస‌భ్య‌త ఉండ‌దు.అశ్లీల‌త అన్న‌ది ఉండ‌నే ఉండ‌దు.జ‌యం మ‌న‌దేరా సినిమాలో మ‌హ‌దేవ నాయుడు అనే ఓ శ‌క్తిమంత‌మ‌యిన పాత్ర నిరూపించింది ఇదే! అంత‌టి ధీరోదాత్త‌త‌, సామాజిక స్పృహ ఆ ఒక్క పాత్ర‌లోనే  నిండి ఉండ‌డం నిజంగానే ఇవాళ్టికి అదొక విశేష‌మే! వెంక‌టేశ్ కెరియ‌ర్ కు ఈ సినిమా మ‌కుటాయ‌మాన‌మే!

ఈ నేప‌థ్యంలో ఈ త‌రుణంలో వెంక‌టేశ్, సౌంద‌ర్య జంట‌గా న‌టించిన జ‌యం మ‌న‌దేరా సినిమాకు సంబంధించి  ఓ అరుదైన స్టిల్ ను రిలీజ్ చేశారు డైరెక్ట‌ర్ ఎన్.శంక‌ర్. ఎన్ కౌంటర్ సినిమాతో ఎంతో పేరుతెచ్చుకున్న శంక‌ర్ ఈ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టారు.ఇట‌లీలో షూటింగ్ సంద‌ర్భంగా తీసిన ఓ చిత్రం ఇప్పుడు నెట్టింట్లో ఉంచారు. సామాజిక‌మాధ్య‌మాల ద్వారా ఆనాటి జ్ఞాప‌కాల‌ను ఒక్క ఫొటోతో పంచుకున్నారు.ఈ సినిమా శంక‌ర్ కెరియ‌ర్ ను మ‌రో మ‌లుపు తిప్పింది. పాట‌ల‌న్నీ వందేమాత‌రం శ్రీ‌నివాస్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా సామాజిక  దృక్పథం, ప్ర‌యోజ‌నం అన్న‌వి ఈ సినిమాలో ఉంటాయి. పుష్క‌లంగా విలువలున్న సినిమా.వెంక‌టేశ్ ద్విపాత్రాభిన‌యం చేశారు.


భాను ప్రియ ఓ ముఖ్యమైన పాత్ర‌లో న‌టించారు.అతుల్ కుల‌కర్ణి మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించారు. త‌రాల నుంచి వ‌స్తున్న దుష్ట ఆచారాల‌ను నిర‌సిస్తూ, ద‌ళిత జీవితాల్లో వెలుగు నింపే ఓ యోధుడి క‌థ ఇది.సినిమా ప‌రంగా ఈ క‌థ‌ను ఎంతో క‌మ‌ర్షియ‌లైజ్ చేశారు.అయినా కూడా ఎక్క‌డా అస‌భ్య‌త‌కు తావులేకుండా వినోద ప్ర‌ధానంగానే ఈ సినిమా మొద‌టి భాగాన్ని న‌డిపించారు.శంక‌ర్ సినిమాల్లో అన్నింటిలో కూడా సామాజిక దృక్ప‌థం, ప్ర‌యోజ‌నం అన్న‌వి ప్ర‌ధానాంశాలుగా ఉంటాయి.త‌రువాత కాలంలో కూడా ఆయ‌న నుంచి మంచి సినిమాలే వ‌చ్చాయి. కానీ అవి ఈ సినిమా అంత పేరు తెచ్చుకోలేక‌పోయాయి.


చిన్ని చిన్న ఆశ‌ల‌న్ని చిందులేసేనే
క‌మ్మ‌నైన మ‌న‌సుల‌న్ని క‌ల్సి ఆడెనే
ఊరూ వాడా క‌ల్సి జాత‌రై వ‌చ్చెనే
తోడూ నీడా క‌ల్సి మ‌హ‌దేవుడాయెనే
ఆనందమో ఆకాశ‌మో
సంద‌డై సంద్ర‌మై ఉప్పొంగెనే.....
అన్న ప‌ల్ల‌వితో సాగే పాట ఇవాళ్టికీ వినప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: