మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి చిత్రం ఎన్నో అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను భారీ స్థాయిలో అనుకున్న విధంగా అలరించలేకపోయింది అనే చెప్పాలి. రవితేజ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ సినిమా తప్పకుండా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో చిత్రయూనిట్ ఉంది.

 అయితే ఈ సినిమా ఫ్లాప్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా రవితేజ తన తదుపరి సినిమాల తో ముందుకు దూసుకుపోతున్నాడు. మిగతా హీరోలు ఆయన స్పీడు అందుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్న రవితేజ ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్న రావణాసుర సినిమాకు సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేశాడు. ఈ చిత్రంలో లాయర్ గా కనిపించనున్న రవితేజ మరొకసారి ఆ పాత్రలో అదరగొట్టనున్నాడు. తాజాగా ఓ పిక్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది  చిత్ర యూనిట్. 

ఇక ఈ సినిమాలో సుశాంత్ మరొక కీలక పాత్రలో నటిస్తుండగా రవితేజ ఈ సినిమా కంటే ముందు మరొక రెండు సినిమాలను కూడా ఒప్పుకున్న విషయం తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను ఇప్పటికే సెట్స్ మీదకు తీసుకు వెళ్లిన ఆయన దాదాపుగా ఆ చిత్రాన్ని పూర్తి చేశాడని చెప్పవచ్చు. ఇక రవితేజ కెరీర్లో 68వ సినిమా గా తెరకెక్కుతోంది త్రినాథ్ రావు దర్శకత్వంలో చేస్తున్న ధమాకా సినిమా. ఈ విధంగా ఈ ఏడాది ఈ నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మాస్ రాజా.  రావణాసుర సినిమా లో ఐదుగురు కథానాయకులు నటించనున్నట్లు తెలుస్తోంది. అను ఇమాన్యుయెల్, దక్ష నగర్కార్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: