యావత్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నటువంటి చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా కోసం గత నాలుగు రోజుల నుంచి థియేటర్ల వద్ద యువత పడిగాపులు కాస్తూ ఉంది. ఈ నెల 24న ప్రీమియం షో కు సిద్ధమైంది. ఇదే చిత్రం ప్రమోషన్లో పనుల్లో చాలా బిజీగా ఉంది చిత్రబృందం. రాజమౌళి మరియు ఎన్టీఆర్ రామ్ చరణ్ అందరూ కలిసి ఈ చిత్రాన్ని తన భుజాన వేసుకుని ప్రమోట్ చేయడం జరుగుతుంది. దేశంలోనే ఉండే పలు నగరాలలో పర్యటించడం ఇదే కాకుండా వరకు ఇంటర్వ్యూలను ఇస్తూ తెగ సందడి చేస్తున్నారు చిత్రబృందం.


అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా కి కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఎలాంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన లేదు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల అన్నిటికీ కథ తనే అందించినప్పటికీ.. గతంలో నటించిన బాహుబలి సినిమాకు విపరీతంగా ప్రమోట్ చేశారు తండ్రి కొడుకులు. ఇక ఇలాంటి సమయంలోనే విప్లవ వీరులు గా పేరుపొందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల కల్పిత కథను సిద్ధం చేసి ఇచ్చాడు. లార్డ్ ఆన్ సమయంలో వరుస ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని వేదికలపై కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రచారం చేయడం జరిగింది.


సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సైతం రామ్ చరణ్ తారక్ లో ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కూడా చేశాడు. కానీ రచయితగా విజయేంద్ర ప్రసాద్ మాత్రం దూరంగా ఉండడంతో ఏమైందా అంటూ అభిమానులు తెగ చర్చలు జరుపుతున్నారు. వారు ఇతర సినిమా స్టోరీ లు రాయడంలో ఆయన బిజీగా ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్ లో కనిపించలేదు అన్నట్లుగా సమాచారం. రాజమౌళి తర్వాత చిత్రం మహేష్ బాబు తో చేస్తున్నాడు ఆ సినిమా కథ కోసం సిద్ధం చేస్తున్నాడు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: