హీరో ప్రభాస్ కు మార్చినెల అసలు కలిసిరాలేదని చెప్పవచ్చు.. నటించిన రెండవ చిత్రం మార్చి నెలలోనే విడుదలైంది.. ఆ చిత్రం కూడా డివైడ్ టాక్ తో నడిచింది. కృష్ణవంశీ తో చేసిన చిత్రమే చక్రం. ఇది మార్చి నెలలో విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఇక తాజాగా నటించిన రాధే శ్యామ్ చిత్రం కూడా విడుదలై ఈ చిత్రం కూడా మిక్స్సుడు టాక్ ను సొంతం చేసుకుంది. అయితే చక్రం సినిమా విడుదలై ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కాబట్టి ఈ సినిమా గురించి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

తెలుగు సినిమా హీరో మరణించడం వంటివి చూపిస్తే జనాలు పెద్దగా యాక్సెప్ట్ చేయరు. అని ఎప్పటి నుండి ఉన్న సెంటిమెంట్ ఇది. చక్రం సినిమా విషయంలో కూడా మరొక సారి అది నిరూపించబడింది. ఇలాంటి కథతో ప్రభాస్ సెలెక్ట్ చేసుకోవడం పెద్ద సాహసమే అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి కదా తనకి చెప్పు కాదని ఎంతో మంది చెప్పినా కూడా ఈ సినిమాని చేయకుండా ఉండలేదు ప్రభాస్. అయితే ముందుగా ఈ సినిమా కథని చిరంజీవికి తెలియజేసినట్లు గా సమాచారం. ఇక ఆ తరువాత మరొక హీరో గోపీచంద్ కూడా ఈ సినిమా కథ వెళ్ళింది.. అయితే ఈ సినిమా చేయడానికి తను సాహసం చేయలేని చెప్పేశారట.


వీళ్లు మాత్రమే కాకుండా మహేష్, మరో కొంతమంది యువ హీరోలు కూడా ఈ ప్రయోగాన్ని చేయలేను అని చెప్పి వదిలేశారట. కానీ ప్రభాస్ మొహమాటం ఎక్కువ అవ్వడంతో కృష్ణవంశీ మాటను కాదనలేక చేశారు. ఇక 2005 మార్చ్ 25 వ తేదీన ఈ సినిమా విడుదలై ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నిర్మాతలకు, అటు బయ్యర్లకు ఎన్నో నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమాను మాత్రం యూట్యూబ్ లో, మూవీస్ లో చూసి చాలామంది బాగుందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: