అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మాతగా ఎన్నో చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇక దీనిని గీత ఆర్ట్స్-2 బ్యానర్ అని ఈ మధ్య పిలుస్తూ ఉన్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాలు దాదాపుగా విజయాన్ని అందుకున్నాయి. ఇక ఈ బ్యానర్ ని అల్లు అరవింద్ వెనక నుండి బన్నీ వాసు తో నడిపిస్తున్నాడని సమాచారం. అల్లు అరవింద్ అన్ని విధాలుగా సినిమాకు సంబంధించిన వాటిని ,నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటూ ఉన్నారు. చిన్న హీరోలతో సరి కొత్త దర్శకులతో వరుస సినిమాలు చేస్తూ వుండడం తో ఈ బ్యానర్ బాగా దూసుకుపోతోంది.


అయితే ప్రస్తుతం హీరో కిరణ్ అబ్బవరం తో సినిమా రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం చివరిగా సెబాస్టియన్ అనే మూవీ తో ప్రేక్షకులకు బాగా అలరించారు. ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా కిరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి గా దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం. అయితే ప్రస్తుతం నటిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మరిన్ని ఆశలు పెట్టుకొన్నారు కిరణ్. ఈ బ్యానర్ పై వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మురళి కిషోర్ డైరెక్షన్లో రూపొందిస్తున్నారు.

ఇక కిరణ్ అబ్బవరం కు జోడీగా కాశ్మీర పరదేశి నటిస్తున్నది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంబంధించినట్లయితే వారికి కొన్ని సన్నివేశాలను తిరుపతిలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు గా యాక్షన్ సన్నివేశాల్ని ఒక పాటను కూడా చిత్రీకరించారు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్ర దర్శకుడు ఇదివరకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: