ఇప్పుడున్న హీరోయిన్లలో డ్యాన్స్ ఇరగదీసే అతి కొద్ది మందిలో పూజా హెగ్డే ఒకరు..డ్యాన్స్ పట్ల ఉన్న శ్రద్ధ, నిబద్ధతను చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేస్తోంది. అంతలా ఈ భామకు డ్యాన్స్ అంటే తెగ ఇష్టం. కేవలం డ్యాన్స్ మాత్రమే కాకుండా నటన కూడా అదిరిపోవడంతో ఆమెకు వరుస అఫర్లు రావడం జరుగుతుంది.రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలో ప్రేరణగా క్యూట్ గా కనిపించిన అమ్మాయి మొన్నటి బీస్ట్ సినిమాలో దళపతి విజయ్ సరసన మెరిసింది. ఇక ఏప్రిల్ 29న రీలజ్ కు రెడీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించింది..
ఈ సినిమాలో అచ్చమైన బ్రాహ్మణ పిల్లలాగా కనిపించనుంది..ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి..దాంతో సినీ అభిమానులు సినిమా ఎప్పుడూ విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.హిందీ, తెలుగు సినిమాలలో నటిస్తూ బిజిగా ఉంది. ఇకపోతే సోషల్ మీడియాలో కూడా పూజాహెగ్డే చురుగ్గా ఉంటుదనె వార్తలు అందరికి తెలిసిందే.. తానూ షూటింగ్ లో విరామం దొరికిన సమయంలో జాలి ట్రిప్ లు వేసుకుంటూ ఫ్యామిలీ తో గడుపుతుంది.. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్న సంగతి తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి