బ్యూటీఫుల్ పూజాహెగ్డే వరుస ప్లాపులతో ఢీలా పడింది.అన్నీ ఇండస్ట్రీ లలో ఆమె క్రేజ్ మాములుగా లేదని చెప్పాలి.వరుస ప్లాపులు వచ్చినా కూడా వెనకడుగు వెయ్యడం లేదు.మరో సినిమాలో నటించెందుకు రెడీ అవుతుంది..రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు మూటగట్టుకుంది.అయితే ఈ అమ్మదుకు ఉన్న క్రేజ్ మాత్రం ప్లాపులతో ఆగిపోలేదు.పూజా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్న పూజా, టాలీవుడ్‌లోనూ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించనుంది.


త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రాబోతున్న భవదీయుడు భగత్‌సింగ్ చిత్రంలోనూ పూజా కథానాయికగా సెలెక్ట్ అయ్యింది.ఈ సినిమా తో  పాటుగా మరో క్రేజీ ప్రాజెక్టు లో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. ఇది నిజంగా గుడ్ లక్ అనే చెప్పాలి.


విజయ్ దేవరకొండ, క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌ లో ఇప్పటికే లైగర్ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే ఈ ఇద్దరి కాంబినేషన్‌ లో 'జనగణమన' చిత్రం కూడా రానుంది. హీరోయిన్‌గా పూజాను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పూజా రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్‌ లో ఉంటుందని, ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పూజా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేయడం గ్రేట్..అందరు ఆశ్చర్య పోతూన్నారు..ఆ సినిమాలు పూజకు హిట్ ను ఇస్తాయో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: