ఒక సైడ్ సినిమాలు చేస్తూనే పవన్ ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా పవన్ తన ‘జనసేన’ ను బలపరచడానికి తన శక్తిమేరకు రకరకాల ఊహాలు అనుసరిస్తున్నాడు. ఇలాంటి వ్యూహాలలో పవర్ స్టార్ లేటెస్ట్ గా అనుసరిస్తున్న వ్యూహం ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి వారికి చేస్తున్న ఆర్ధిక సహాయంతో మళ్ళీ పవన్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు.


ఈ కార్యక్రమ నిర్వాహణలో పవన్ చాల ఊళ్లు వెళుతున్నాడు. అలా వెళ్ళిన ప్రతిసారి పవన్ కుడి చేతి వేలుకు ఉన్న ఒక పెద్ద పగడపు ఉంగరం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆడంబరాలకు చాల దూరంగా ఉండే పవన్ ఇంత పెద్ద ఉంగరం ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటూ చాలామంది వారివారి స్థాయిలో పరిసోధనలు జరిపినప్పుడు కొన్ని ఆశక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.


జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడు లేదా కుజుడు అనే గ్రహశాంతికి పగడం వాడతారు అని అంటారు. కర్ణాటక రాష్ట్రంలో మహిళలు చాలామంది తమ మంగళ సూత్రాలలో కట్టుకునే సాంప్రదాయం ఉంది. ఇక పురుషులకు అయితే రాజకీయ అధికార ప్రాప్తి పోరాట పటిమ నాయకత్వ లక్షణాల పెంపు కోసం చాలామంది జ్యోతిష్కులు మంచి పెద్ద సైజు పగడాన్ని ఉంగరంగా పెట్టుకోమని నాయకులకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ అలాంటి సలహాను పాటించి ఇలా చాల ఆకర్షినీయంగా కనిపిస్తున్న ఆ పగడపు ఉంగరాన్ని పెట్టుకుని ఉంటాడు అంటూ ఊహాగానాలు వస్తున్నాయి.


పవన్ ఆధ్యాత్మిక రాజకీయ ఆలోచనలను ప్రభావితం చేసే అతి తక్కువ మంది వ్యక్తులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకడు అని అంటారు. త్రివిక్రమ్ సలహాతోనే పవన్ గత కొంతకాలంగా జంధ్యం ఎప్పుడు తన ఒంటి పై దరిస్తున్నాడు. ఆఖరికి షూటింగ్ సమయంలో కూడ ఆ జంధ్యాన్ని క్రమం తప్పకుండ ఉంచుకుంటున్నాడు. పవన్ లోని ఇలాంటి ఆలోచనల మార్పుకు ఈమధ్య కాలంలో పవన్ లో పెరిగిపోతున్న ఆధ్యాత్మికత అని కూడ అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: