టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరియర్ లో ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో విజయవంతమైన సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అక్కినేని నాగార్జున తన కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ మూవీ లలో కూడా నటించాడు.  

అలా నాగార్జున నటించిన ప్లాప్ మూవీ లలో  భాయ్ సినిమా  ఒకటి. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన భాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక ఫ్లాప్ మూవీ గా మిగిలిపోయింది. బాయ్ సినిమా ప్లాప్ అని నాగార్జున బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఓ ఇంటర్వ్యూ లో భాయ్ సినిమా దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ... బాయ్ మూవీ స్టోరీ హిలేరియస్ కథ అని ,  కానీ చేసిన మార్పుల వల్ల సీరియస్ కథ అయిందని వీరభద్రం చౌదరి చెప్పుకొచ్చాడు.

నాగార్జున హీరో అయ్యాక ఈ కథలో అనేక మార్పులు చేర్పుల వల్ల కథలో కామెడీ తగ్గి సీరియస్ నెస్ పెరిగింది అని, అలా భాయ్ మూవీ లో కామెడీ లేకపోవడం వల్ల ప్రేక్షకులకు భాయ్ సినిమా నచ్చలేదు అని వీరభద్రం చౌదరి చెప్పుకొచ్చాడు. అలాగే బాయ్ సినిమా ఫ్లాప్ కావడం వల్ల నాగార్జున కు నాకు మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు అని ఇంటర్వ్యూ లో వీరభద్రం చౌదరి చెప్పుకొచ్చాడు.  ఇది ఇలా ఉంటే బాయ్ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: