తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు అయితే ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఇక గతంలో ఎన్టీఆర్ సమీరా రెడ్డి ప్రేమించుకున్నారు అని వార్తలు తెగ పాపులర్ అయ్యాయి..

ఇక వీరి కాంబినేషన్లో తెరకెక్కించిన సినిమాలు అశోక్ మరియు నరసింహుడు ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. అయితే ఎన్టీఆర్ సమీరా రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకున్నారు అని కొన్ని కారణాలవల్ల వాళ్ళిద్దరు విడిపోయారని వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ వచ్చి విజయం సాధించాడు. ఇప్పటివరకు కూడా బాలయ్య హీరో గా మంచి సక్సెస్లను అందుకుంటూ తన కెరీర్ను కొనసాగిస్తున్నారు.

 

చెప్పాలంటే ఈ జనరేషన్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఊహించని స్థాయిలో క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆయన గురించి చెప్పాలంటే.. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు విడుదలయ్యాయి అంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు తిరగరాయాల్సిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే ఇలాంటి కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టే ఛాన్స్ వస్తే ఎవరైనా సరే వదులుకుంటారా.. వాస్తవం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి మంచి స్నేహితులు వాళ్ళిద్దరి మధ్య అంతకుమించి మరేమీ లేదని సమాచారం ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని వీళ్లిద్దరూ ఎప్పుడూ కూడా అనుకోలేదట.. కానీ వైరల్ గా మారిన రూమర్లను వీళ్లిద్దరు పెద్దగా పట్టించుకోలేదనీ తెలుస్తుంది.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి ని వివాహం చేసుకోగా సమీరా రెడ్డి అక్షయ్ వడ్డే అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారట.ప్రస్తుతం సమీరా రెడ్డి సినిమా రంగానికి దూరంగా ఉన్నారని విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే సమీరారెడ్డి మళ్లీ సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.సీనియర్ ఎన్టీఆర్ ఇంట మనవడిగా పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో సమీరా రెడ్డిని ప్రేమించాడని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా చాలా వైరల్గా మారుతున్నాయి. సమీరా రెడ్డి తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: